దేవదారుని కాదు... అశోకానీ కాదు!

హాయ్‌ ఫ్రెండ్స్‌... నన్ను చూసే ఉంటారుగా...కానీ నా కబుర్లు మాత్రం మీకంతగా తెలియదనుకుంటా... ఏకంగా నా పేరునే తప్పుగా పిలుస్తారు... అందుకే నా విశేషాలు చెప్పాలని ఇలా వచ్ఛా.. ఆలస్యం దేనికి? చదివేయండి మరి! నన్ను మీరంతా అశోక వృక్షమని అనుకుంటారు. కానీ అశోక చెట్టు అనేది వేరేది ఉంది. నిజానికి నా పేరు నరమామిడి. ఇంకా పొలియాల్థియా లాంగీఫోలియా అనీ పిలుస్తారు....

Updated : 30 Aug 2019 00:28 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... నన్ను చూసే ఉంటారుగా...కానీ నా కబుర్లు మాత్రం మీకంతగా తెలియదనుకుంటా... ఏకంగా నా పేరునే తప్పుగా పిలుస్తారు... అందుకే నా విశేషాలు చెప్పాలని ఇలా వచ్ఛా.. ఆలస్యం దేనికి? చదివేయండి మరి!

నా పేరు!

న్ను మీరంతా అశోక వృక్షమని అనుకుంటారు. కానీ అశోక చెట్టు అనేది వేరేది ఉంది. నిజానికి నా పేరు నరమామిడి. ఇంకా పొలియాల్థియా లాంగీఫోలియా అనీ పిలుస్తారు. కొందరు ఫాల్స్‌ అశోకా, ఫేక్‌ దేవదార్‌ అంటూ పిలుస్తుంటారు. మరేమో నా కుటుంబం అనోనేసి. మీకు బాగా తెలిసిన సీతాఫలం చెట్టు నాకు బంధువే.

నేనుండే చోటు!

మీకు చాలా చోట్ల కనిపిస్తుంటా. ఎక్కువగా భారత్‌, శ్రీలంక దేశాల్లో పెరుగుతుంటా. నన్ను ఇండియాకు చెందిన వృక్షంగా చెబుతారు.●

రూపురేఖలు!

న్నగా పొడుగ్గా ఎవరో చెక్కినట్టు ఒక్కతీరుగా ఉండే నా రూపమంటే మీకు ఇష్టమే అనుకుంటా. నేను దాదాపుగా 30 అడుగుల ఎత్తు వరకు పెరుగుతా. నా ఆకులన్నీ ఇంచుమించు ఎనిమిది అంగుళాల పొడవుతో భలే బాగుంటాయి. అంతేకాదూ అవన్నీ నా నిటారైన రూపంపై కప్పినట్టు ఎప్పుడూ పచ్చగా మెరిసిపోతూ అందర్నీ ఆకట్టుకుంటాయ్‌. నా పువ్వుల్ని చూశారా? ఎందుకిలా అడిగానంటే అవన్నీ నా ఆకుల్లో కలిసిపోయి అంతగా కనపడవు. పల్చగా ఆకు పచ్చని రంగులో నక్షత్రాకారంలో గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ●

నా వల్ల లాభాలెన్నో!

శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి నన్ను ఎక్కువగా పెంచుతారు.

 ఆయుర్వేదంలో నన్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా రకరకాల ఔషధాల్లోనూ వాడతారు. చర్మసంబంధ, చక్కెర వ్యాధులు తగ్గటానికీ నేనెంతో సాయపడతా. ఇంకా నా బెరడును శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఉపయోగిస్తుంటారు.

 చూడచక్కగా ఉంటా కదా! అందుకే నన్ను ఆలయాల దగ్గర, ఉద్యానవనాల్లో ఎక్కువగా పెంచుతుంటారు.

చాలామంది ప్రహరీ గోడగానూ నన్ను నాటుతుంటారు.

నా కలప తక్కువ బరువుతో ఉంటుంది కదా అందుకే సెయిలింగ్‌ షిప్స్‌ తయారీలో నన్ను వాడుతుంటారు. ఇంకా పెన్సిళ్లు, బాక్సులు, అగ్గిపుల్లల తయారీలో ఉపయోగిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని