పోటీలో నెగ్గింది.. భవనమయ్యింది!
ఆస్ట్రేలియా అనగానే సిడ్నీ గుర్తొచ్చేస్తుంది...సిడ్నీ అనగానే అక్కడి ఒపేరా హౌస్ జ్ఞాపకమొచ్చేస్తుంది... మరి నేను ఇప్పుడు అక్కడికే వెళ్లొచ్చా...ఆ కబుర్లను మీ కోసం ఇక్కడికి మోసుకొచ్చా...నేనెవరూ...? మీ చిన్నూ!
ఆకారం చిత్రం..
ఈ ఫొటోలోని భవనాన్ని మీరు చాలా సార్లే చూసుంటారుగా. ఇదే సిడ్నీ ఒపేరా హౌస్. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఒకటి. ఆస్ట్రేలియా దేశ చారిత్రక కట్టడాల్లోనూ ప్రముఖమైనది. ఈ దేశంలో న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో సిడ్నీ ఉంది. అక్కడి హార్బర్‌లోనే ఇది కొలువుదీరింది. తెరచాపల్లాంటి పై కప్పులతో చిత్రమైన ఆకారంతో ఉందిది. చూస్తుంటే దీన్ని ఇలా ఎలా కట్టారబ్బా! అని ఆశ్చర్యమేసేసింది. నాలాగే ఏటా బోలెడు మంది పర్యటకులు ఇక్కడికి వెళుతుంటారు. దీంట్లో జరిగే ప్రదర్శనల్ని ఏడాది మొత్తంలో 20లక్షల మందికి పైగా చూస్తున్నార్ట.
డిజైన్లలో మేటి!
తమాషా రూపంతో ఉండే ఈ కట్టడం డానిష్ ఆర్కిటెక్ట్ జోర్న్ ఉట్జొన్ చేతుల్లో రూపుదిద్దుకుంది. ఈ భవనం రూపు కోసం 1956లో ఇక్కడ ‘ఒపేరాహౌస్ ఇంటర్నేషనల్ డిజైన్ కాంపిటీషన్’ జరిగింది. 233 డిజైన్లు పోటీలోకొచ్చాయి. చివరికి ఉట్జొన్ డిజైన్ ఎంపికయ్యింది. అదే భవన రూపం దాల్చింది. స్థానిక ప్రభుత్వమే దీన్ని కట్టించింది.
లాటరీ ద్వారా డబ్బు!
1959లో దీన్ని కట్టడం ప్రారంభించారు. నాలుగేళ్లలో పూర్తయిపోతుందనుకుంటే పద్నాలుగేళ్లు పట్టింది. ఇందుకు పది వేల మంది పని చేశారు. 1973లో దీన్ని ఎలిజిబెత్ రాణి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇక్కడ ప్రదర్శనలు ప్రారంభం అయ్యాయి. దీన్ని కట్టడానికి అప్పట్లోనే 102 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం నిధుల్ని లాటరీ ద్వారానే సమకూర్చారు.
కొంత ఫ్రాన్సులో..!
సముద్రపు ఒడ్డున ఇది ఒద్దికగా నిలిచి ఉంటుంది. 600 అడుగుల పొడవు, 294 అడుగుల వెడల్పుతో మొత్తం 4.4 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది మొత్తం కాంక్రీటుతోనే నిర్మితమయ్యింది. రూఫ్ డోమ్‌ల్లాంటి వాటిని ముందు కింద పోతపోశారు. వాటికి మిలియన్ల టైళ్లు అంటించి అందంగా తయారు చేశారు. ఆ పనంతా ఫ్రాన్స్‌లో జరిగింది. వీటిలో అతి ఎత్తయిన డోమ్ సముద్రమట్టానికి 67మీటర్ల ఎత్తులో ఉంది. ఇంకా దీనికి ఉపయోగించిన అద్దాలూ ఫ్రాన్స్‌లో తయారై వచ్చాయిట. అక్కడున్న గైడ్ అంకుల్ ఒకరు చెప్పారు నాతో.
ఏమేం ఉంటాయంటే?
మన హైదరాబాద్‌లో రవీంద్రభారతి ఉంది కదా. అలాంటిదే ఈ సిడ్నీ ఒపేరా హౌసూనూ. కాకపోతే ఇందులో ఉండే హాళ్లు ఎక్కువ. ఒక కాన్సర్ట్ హాల్, జాన్ సూతర్లాండ్ థియేటర్, డ్రామా థియేటర్, ప్లేహౌస్, ద స్టూడియో, ఉట్జొన్ రూంలు ఉంటాయిందులో. వీటన్నింటిలో కలిపి మొత్తం 5,738మంది కూర్చోవడానికి వీలుంది. అక్కడ కూర్చుని నేనూ ఓ మ్యూజికల్ షో చూసేసాన్లేండి. ఇంతే సంగతులు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?
-
Politics News
Harish Rao: ఇదేనా భాజపా చెబుతోన్న అమృత్కాల్?: హరీశ్‌రావు ఫైర్
-
Movies News
Social Look: వాణీకపూర్ ‘క్రైమ్ థ్రిల్లర్’.. చీరలో శోభిత హొయలు!
-
Politics News
BS Yediyurappa: సిద్ధూపై యడ్డీ తనయుడి పోటీ..?
-
World News
United Airlines: ఖరీదైన విస్కీ బాటిల్లో మద్యం చోరీ..కంగుతిన్న విమాన ప్రయాణికుడు
-
Politics News
Andhra News: ఉదయగిరికి వచ్చా.. దమ్ముంటే తరిమికొట్టండి: ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి సవాల్