గబ్బిలాల గుహ... విశేషాలు ఆహా!

అదో చీకటి గుహ. అందులోకి వెళితే మాత్రం బోలెడు అద్భుతాలు. లోపల ఎన్నో వింత ఆకారాలు. పైగా గలగలా ప్రవహించే నీళ్లు. ఈ సంగతులన్నీ మేఘాలయలో ఉన్న ‘సిజు గుహ’వే.

Published : 17 May 2016 00:56 IST

గబ్బిలాల గుహ... విశేషాలు ఆహా!

అదో చీకటి గుహ. అందులోకి వెళితే మాత్రం బోలెడు అద్భుతాలు. లోపల ఎన్నో వింత ఆకారాలు. పైగా గలగలా ప్రవహించే నీళ్లు. ఈ సంగతులన్నీ మేఘాలయలో ఉన్న ‘సిజు గుహ’వే.

* స్థానిక భాషలో దీన్ని ‘డొబక్కొల్‌’గా పిలుస్తారు. అంటే గబ్బిలాల గుహ అని అర్థం. ఇందులో వేలాది గబ్బిలాలు నివాసం ఉంటాయి.

* గుహ పొడవు ఏకంగా 4 కిలోమీటర్లకు పైనే. మన దేశంలో మూడో అతిపెద్ద గుహ ఇదేనని చెబుతారు.

* లోపల సున్నపురాయితో ఏర్పడిన ఎన్నో వింత ఆకారాలు అబ్బురపరుస్తాయి. ఎన్నో మలుపులతో గుహ గజిబిజిగా పద్మవ్యూహాన్ని తలపిస్తుంది.

* బ్రిటిష్‌ పరిశోధకులు 1920లో ఈ గుహను కనుగొన్నారు. ఎంతోమంది శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు.

* లోపల ఎన్నో రకాల జలచరాలు ఉన్నాయి. 2007లో కొత్త జాతి కేవ్‌ఫిష్‌ ఇందులో బయటపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని