అందాల లోయలో...అద్భుత శిల్పాలు!

అనగనగా ఓ లోయ...అందులో అబ్బురపరిచే నిలువెత్తు రాతి విగ్రహాలు...కాలం గడిచే కొద్దీ వాటి సంఖ్య పెరుగుతోంది...ఇంతకీ ఎవరు చేస్తున్నారు? ఏమా సంగతులు?

Published : 13 Jul 2016 01:31 IST

అందాల లోయలో...అద్భుత శిల్పాలు!

అనగనగా ఓ లోయ...అందులో అబ్బురపరిచే నిలువెత్తు రాతి విగ్రహాలు...కాలం గడిచే కొద్దీ వాటి సంఖ్య పెరుగుతోంది...ఇంతకీ ఎవరు చేస్తున్నారు? ఏమా సంగతులు?

గ్రానైట్‌ రాయితో ఏకశిలపై చెక్కిన ఈ శిల్పాలు ఒక్కోటి దాదాపు 15 అడుగులకు పైనే ఉంటాయి.

సాధువులు... ఆదర్శ మూర్తులు... చరిత్రలో వేరు వేరు కాలాలకు చెందినవారు ఒకే దగ్గర విగ్రహాల రూపంలో కొలువై ఉన్నారు. చూడాలంటే ఫ్రాన్స్‌లోని బ్రిటానీకి వెళ్లాల్సిందే.

* అక్కడో మారుమూల లోయ ఈ విగ్రహాల వల్ల ‘వ్యాలీ ఆఫ్‌ సెయింట్స్‌’గా ప్రసిద్ధికెక్కింది. ఫ్రాన్స్‌ ప్రజలకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల విగ్రహాలను రూపొందించే పనిలో భాగమే ఇదంతా. ఇది ఏకంగా 50 ఏళ్ల పాటు సాగే ప్రాజెక్ట్‌. ఇప్పటి వరకు 66 మంది విగ్రహాలను చేసి లోయలో నెలకొల్పారు.

* చిలీ దేశానికి దగ్గరలో పసిఫిక్‌ సముద్రంలో ఉండే ఈస్టర్‌ ఐలాండ్‌ గురించి వినే ఉంటారుగా? అందులో వందలాది రాతి విగ్రహాలు ఉంటాయి. ఈ వింత దీవిలాగే సెయింట్స్‌ వ్యాలీని కూడా చేయాలనే ఉద్దేశమన్నమాట.

* 2008లో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు.

* ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శిల్పుల్ని రప్పించి వీటిని చెక్కిస్తున్నారు. ఒక్కో శిల్పం చెక్కడానికి నెలల కొద్దీ సమయం పడుతోంది. ఒక విగ్రహం కోసం దాదాపు తొమ్మిదిలక్షల రూపాయల ఖర్చు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని