కరచాలనం చేయండి ఫొటోలొద్దు!

ఆఫ్రికా ఖండంలోని దేశం. ఈ దేశానికి పశ్చిమాన టోగో, తూర్పున నైజీరియా, ఉత్తరాన బుర్కినాఫాసో, నైజర్‌ దేశాలు సరిహద్దులు. దక్షిణాన అట్లాంటిక్‌ మహా సముద్ర భాగమైన గినియా అఖాతం ఉంది.....

Published : 19 Feb 2017 01:27 IST

కరచాలనం చేయండి ఫొటోలొద్దు!

బెనిన్‌


* బెనిన్‌... ఆఫ్రికా ఖండంలోని దేశం. ఈ దేశానికి పశ్చిమాన టోగో, తూర్పున నైజీరియా, ఉత్తరాన బుర్కినాఫాసో, నైజర్‌ దేశాలు సరిహద్దులు. దక్షిణాన అట్లాంటిక్‌ మహా సముద్ర భాగమైన గినియా అఖాతం ఉంది.


జెండా: ఎరుపు రంగు ధైర్యానికి, పసుపు రంగు సంపదకు, ఆకుపచ్చ ఆశకి సూచికలు.


* రాజధాని పోర్టోనోవొలో 17వ శతాబ్దం మొదట్లో బానిసల వ్యాపారం ఎక్కువగా జరిగేది. అందుకే ఈ తీరాన్ని బానిసల తీరంగా పిలిచేవారు. ఇక్కడి నుంచి బానిసల్ని నౌకల్లో వేరే ప్రాంతాలకు రవాణా చేయడం ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది.
* బెనిన్‌ 1960 ఆగస్టు ఒకటిన ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం పొందింది.
* 1975 నవంబరు నుంచి ఈ దేశాన్ని బెనిన్‌ అని పిలుస్తున్నారు.
* 1990లో నియంతృత్వ పాలన నుంచి బహుళ పార్టీలున్న ప్రజాస్వామ్య దేశంగా మారింది.


* ఇక్కడ ఎడమ చేతితో తినడం కానీ, ఎడమ చేతితో ఇతరులకు ఏదైనా ఇవ్వడం కానీ చేయకూడదు. అలా చేస్తే అమర్యాదగా భావిస్తారు.


* ఈ దేశానికే దహోమి అని మరో పేరు. 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఇది దహోమి రాజ్యంగా ఉండేది.


దేశం: బెనిన్‌ రాజధాని: పోర్టో నోవొ జనాభా: 1,08,79,829 విస్తీర్ణం: 1,14,763 చదరపు కిలోమీటర్లు భాష: ఫ్రెంచ్‌ కరెన్సీ: పశ్చిమ ఆఫ్రికన్‌ సీఎఫ్‌ఏ ఫ్రాంక్‌


* ప్రజలు ఫ్రెంచ్‌ తర్వాత ఫాన్‌, యోరుబా భాషల్ని ఎక్కువగా మాట్లాడుతుంటారు.
* ఈ దేశప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధార పడతారు.
* జాతీయ క్రీడ సాకర్‌.
* దేశంలో 31 శాతం భూభాగాన్ని వ్యవసాయానికి ఉపయోగిస్తారు. 40 శాతం అడవులతో నిండి ఉంటుంది.


* ఇక్కడ నేరాలు తక్కువే. కానీ దొంగతనాలు ఎక్కువ. అందుకే ప్రతి ఇంటి యజమానీ రాత్రి వేళల్లో వాచ్‌మేన్‌ను తప్పక పెట్టుకుంటారు.


* ఒకరితో మాట్లాడే ముందూ, వీడ్కోలు చెప్పాకా కరచాలనం చేయడం ఆనవాయితీ.
* ఇక్కడి ప్రజలు ఫొటోలు తీసుకోవడానికి ఇష్టపడరు. అవి దుర్వినియోగం అవుతాయని భావిస్తారు.


* రాజధాని పోర్టోనోవొని అడ్జటేజ్‌, హగ్‌బోనౌ అని కూడా పిలుస్తారు.
* దేశం మొత్తంలో పెద్ద నగరం కొటోనౌ.
* ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం చెక్కతో చెక్కిన ముసుగులకు ప్రసిద్ధి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని