Kiara Advani: కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!

కియారా అడ్వాణీ ఓ పాన్‌ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.

Published : 27 Apr 2024 00:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’ (Salaar). గతేడాది డిసెంబరులో విడుదలైన ఈ పాన్‌ ఇండియా మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీని సీక్వెల్‌ కోసం ప్రభాస్‌ అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమాలో హీరోయిన్‌ శ్రుతి హాసన్‌తోపాటు బాలీవుడ్‌ నటి కియారా (Kiara Advani) అడ్వాణీ కీలక పాత్ర పోషించనున్నారని, ప్రత్యేక గీతంలోనూ ఆమె ఆడిపాడనున్నారని ప్రచారం జరిగింది. అవన్నీ రూమర్సేనని ఓ ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ పేర్కొంది. ‘సలార్‌ 2’ (Salaar 2) టీమ్‌ కియారాను సంప్రదించలేదని ఆమె సన్నిహిత వర్గాలు స్పష్టం చేసినట్టు చెప్పింది. కియారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘భరత్‌ అనే నేను’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘వినయ విధేయ రామ’లోనూ సందడి చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్‌ (Ram Charan) సరసన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)లో నటిస్తున్నారు.

‘శౌర్యాంగ పర్వం’ (Shouryaanga Parvam) పేరుతో ‘సలార్‌ 2’ తెరకెక్కనుంది. తొలి భాగంలో ప్రధాన పాత్ర పోషించిన మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబు తదితరులు రెండో భాగంలోనూ కనిపించనున్నారు. ఈ సీక్వెల్‌పై ఓ ఇంటర్వ్యూలో నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సలార్‌ 1’.. పార్ట్‌ 2కు ట్రైలర్‌ లాంటిది. సలార్‌ పార్ట్‌ 2.. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుంది. యాక్షన్‌, డ్రామా, పాలిటిక్స్‌.. ఇలా పలు అంశాలు సీక్వెల్‌లో కనిపిస్తాయి. దర్శకుడు పార్ట్‌ 1లో పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. సీక్వెల్‌ చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి’’ అని తెలిపారు. జూన్‌ లేదా జులైలో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని