Pakistan: భారత్‌ ఎన్నికల వేళ పాకిస్థాన్‌ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!

భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ పాకిస్థాన్‌ తన అక్కసును మరోసారి వెల్లగక్కింది.

Updated : 26 Apr 2024 22:46 IST

ఇస్లామాబాద్‌: భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ పాకిస్థాన్‌ (Pakistan) తన అక్కసును మరోసారి వెల్లగక్కింది. రాజకీయ మైలేజీ కోసం తమ ప్రసంగాల్లో పాకిస్థాన్‌ను లాగొద్దని వ్యాఖ్యానించింది. జమ్మూ కశ్మీర్‌పై భారత్‌ నాయకులు చేస్తోన్న అన్ని వాదనలను తిరస్కరిస్తున్నట్లు చెప్పింది. పాక్‌ విదేశాంగ వారాంతపు మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

‘జమ్మూ కశ్మీర్‌పై అసమంజసమైన వాదనలతో భారత్‌ నేతలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ప్రకటనలు పెరుగుతుండటాన్ని  గమనిస్తున్నాం. ఇటువంటి వాటిని పాకిస్థాన్‌ తిరస్కరిస్తోంది. ఉద్రేకపూరిత వ్యాఖ్యలు ప్రాంతీయ శాంతికి ముప్పు కలిగిస్తాయి. ఎన్నికల వేళ తమ బహిరంగ ప్రసంగాల్లో పాకిస్థాన్‌ను లాగే పద్ధతికి ముగింపు పలకండి’ అని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి ముంతాజ్‌ జరా బలూచ్‌ వ్యాఖ్యానించారు. భారత్‌ నిరాధార వాదనలు చేస్తోందన్నారు.

బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్‌ ప్రధాని

మరోవైపు, కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌ చేసే వాదనలను భారత్‌ దీటుగా తిప్పికొడుతోంది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌, లద్ధాఖ్‌లు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ఉద్ఘాటిస్తోంది. ఈ విషయంలో మాట్లాడటానికి మరే దేశానికి అధికారం లేదని స్పష్టం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు