అగ్నిపర్వతాలు... ఘుమఘుమలు!

కొమరోజ్‌... హిందూ మహాసముద్రంలో ఉన్న సార్వభౌమ ద్వీప దేశం. ఈ దేశానికి వాయవ్యంలో టాంజానియా, తూర్పున గ్లోరియోస్‌ ద్వీపాలు, నైరుతీలో మడగాస్కర్‌, పశ్చిమాన మొజాంబిక్‌ ఉంటాయి.చిన్నాపెద్దా అగ్నిపర్వతాలతో నిండి ఉంటుందీ దేశం.ఈ ద్వీప దేశం చాలా చిన్నది. మన దేశంలోనే చిన్నదైన గోవా రాష్ట్రం కన్నా ఇంకా బుల్లిది.

Published : 09 Apr 2017 01:25 IST

అగ్నిపర్వతాలు... ఘుమఘుమలు!
 కొమరోజ్‌

* కొమరోజ్‌... హిందూ మహాసముద్రంలో ఉన్న సార్వభౌమ ద్వీప దేశం.
* ఈ దేశానికి వాయవ్యంలో టాంజానియా, తూర్పున గ్లోరియోస్‌ ద్వీపాలు, నైరుతీలో మడగాస్కర్‌, పశ్చిమాన మొజాంబిక్‌ ఉంటాయి.
* చిన్నాపెద్దా అగ్నిపర్వతాలతో నిండి ఉంటుందీ దేశం.


* ఈ ద్వీప దేశం చాలా చిన్నది. మన దేశంలోనే చిన్నదైన గోవా రాష్ట్రం కన్నా ఇంకా బుల్లిది.
* ఈ దీవుల్లో మొదటిసారిగా అడుగుపెట్టింది పాలీనీషియన్లు, మెలనీషియన్లు, మలయాలు, ఇండోనేషియన్లు. వీరంతా క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దానికి ముందే ఇక్కడికొచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

* చిన్నచిన్న దీవులతో ఉన్న ఈ ద్వీప దేశంలో గ్రాండీ కొమరీ, మొహెలీ, అన్‌జోన్‌, మయొట్టీ అనే నాలుగు ముఖ్యమైన దీవులుంటాయి. వీటిల్లో మయొట్టీ ద్వీపం ఇంకా ఫ్రాన్స్‌ అధీనంలోనే ఉంది.

* ఈ దేశం 1975 జులైలో ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం పొందింది.



* సువాసన నూనెల్లో ఉపయోగించే ‘ఇలాంగ్‌ ఇలాంగ్‌’ అనే నూనెల్ని ప్రపంచం మొత్తంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందీ దేశం.


* ఈ ద్వీప వాతావరణంలో మాత్రమే నివసించే ప్రత్యేకమైన 20 పక్షి జాతులు ఇక్కడుంటాయి. మాంగూస్‌ లెమర్లు మడగాస్కర్‌తో పాటు ఈ దేశంలో మాత్రమే కనిపిస్తాయి.
* బియ్యం, పెట్రోలియం ఉత్పత్తులు, సిమెంట్‌, ఇతర ఆహార పదార్థాల్ని ఈ దేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది.
* ‘కొమరోజ్‌’ అరబిక్‌ పదం నుంచి వచ్చింది. దీనర్థం చంద్రుడు.


* ఇక్కడ ఎక్కువగా లవంగాలు, కొబ్బరి, అరటి పండ్లు, ఇతర సుగంధ ద్రవ్యాల్ని పండిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని