Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 26 Apr 2024 21:00 IST

1. వైకాపాను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: పవన్‌ కల్యాణ్‌

 రైతులకు మద్దతు ధర ఇప్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని మలికిపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. జగన్‌పై చిన్న గులకరాయి పడితేనే యువకుడిపై కేసు పెట్టారని, దళితుడిని చంపి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబుపై మాత్రం చర్యలు లేవని మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ముగిసిన రెండో విడత పోలింగ్‌.. ఓటింగ్‌ శాతాలు ఇలా..!

సార్వత్రిక ఎన్నికల (Lok sabha Elections) సమరంలో రెండో విడత పోలింగ్‌ (second Phase Voting) ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల  పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా  దేశంలోని 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన జగన్‌: వైఎస్‌ షర్మిల

రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేస్తే.. ఆయన ఆశయాలకు వారసుడిగా చెప్పుకునే జగన్‌.. అధికారంలోకి వచ్చి ఐదేళ్లయినా ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రసంగించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. టిబెట్‌ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం: చైనా

చైనా-టిబెట్‌ల మధ్య నెలకొన్న వివాదంపై చర్చల అంశం దశాబ్దకాలం తర్వాత తెర పైకి వచ్చింది. ఈ క్రమంలో బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్‌ స్వయంపరిపాలన అధికారులతో కాదని తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. భార్యకు రూ.54 లక్షలు అప్పు ఇచ్చిన అఖిలేశ్.. ఆస్తులు ఎన్నంటే?

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) తన పేరిట ఉన్న ఆస్తుల్ని ప్రకటించారు. ప్రస్తుతం కన్నౌజ్‌ నియోజవర్గం నుంచి పోటీ చేస్తోన్న ఆయనకు రూ.26.34 కోట్ల ఆస్తిపాస్తులున్నాయి. ఆయన సతీమణి, మైన్‌పురీ అభ్యర్థి డింపుల్ యాదవ్ (Dimple Yadav) ఆస్తుల మొత్తం రూ.15 కోట్లుగా ఉంది. మొత్తంగా వారిద్దరి సంపద విలువ రూ.41 కోట్లని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. పవన్‌కు మద్దతుగా రంగంలోకి వరుణ్‌తేజ్‌

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా సినీనటుడు వరుణ్‌ తేజ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పవన్‌ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శనివారం ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. గొల్లప్రోలు రూరల్‌ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు వరుణ్‌తేజ్‌  ప్రచారం ప్రారంభం కానుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత

సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. అధికార పార్టీ నేతలు భారీగా మద్యం నిల్వ చేసినట్టు ఫిర్యాదులు అందడంతో శుక్రవారం రాత్రి ఎస్‌ఈబీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నాలుగు ప్రాంతాల్లో అక్రమ మద్యం నిల్వలు గుర్తించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. మోదీ ఆందోళనగా కనిపిస్తున్నారు: రాహుల్ వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల వేళ.. భాజపా, కాంగ్రెస్ (BJP-Congress) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ప్రధాని మోదీ (PM Modi)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శలు చేశారు. ఈ మధ్య ఆయన ఆందోళనగా కనిపిస్తున్నారని అన్నారు. కర్ణాటకలో బీజాపుర్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9.  భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్‌: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య

అమెరికా (USA)లో భారతీయులు (Indians) పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్‌ గార్సెట్టి (Eric Garcetti) అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. అగ్రరాజ్యంలో సంస్థ సీఈవో (CEO) అయ్యే అవకాశాలు భారతీయులకే ఎక్కువగా ఉంటున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక

భారత్‌ (India)తో దౌత్య విభేదాల వేళ మాల్దీవులు (Maldives) చైనా (China)కు దగ్గరవుతోంది. ఇటీవల డ్రాగన్‌ పరిశోధక నౌక (research ship) ఒకటి కొన్నిరోజుల పాటు ఈ దీవుల జలాల్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని