నీటిలో ఇళ్లంట... సముద్రమే లోకమంట!

ఓ చిత్రమైన వూరుంది. ఎక్కడంటే మలేసియా తీరంలో. తీరంలో అంటే సముద్రం ఒడ్డున అనుకునేరు... కానేకాదు. అది ఏకంగా సముద్రంలోనే ఉంది మరి. భూమిపై ఉండేందుకు బోలెడు చోటుండగా అసలు వీళ్లు సముద్రంలోనే ఇళ్లు ఎందుకు కట్టుకున్నారబ్బా... అనిపిస్తే, ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..!

Published : 08 Jun 2017 01:41 IST

నీటిలో ఇళ్లంట... సముద్రమే లోకమంట!

చిత్రమైన వూరుంది. ఎక్కడంటే మలేసియా తీరంలో. తీరంలో అంటే సముద్రం ఒడ్డున అనుకునేరు... కానేకాదు. అది ఏకంగా సముద్రంలోనే ఉంది మరి. భూమిపై ఉండేందుకు బోలెడు చోటుండగా అసలు వీళ్లు సముద్రంలోనే ఇళ్లు ఎందుకు కట్టుకున్నారబ్బా... అనిపిస్తే, ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..!

* కొన్నేళ్ల క్రితం ఫిలిప్పీన్స్‌ నుంచి బజావు అనే తెగవాళ్లు మలేషియాలోకి వలస వచ్చేయబోయారు. ఆ దేశాధికారులు మాత్రం వాళ్లని తమ దేశంలోకి అడుగుపెట్టనే పెట్టనివ్వలేదు. దీంతో వాళ్లు తిరిగి వెళ్లలేక మలేషియాలోని సాభా తీర సముద్రంలో చెక్కతో ఇలా ఇళ్లు కట్టేసు కున్నారన్నమాట!

* పొడవాటి కర్రల్ని సముద్రం అడుగు ఇసుకలోకి దూర్చి పునాదుల్లా వేసుకున్నారు. నీరు ఇళ్లలోకి రానంత ఎత్తులో కర్రలు, ఆకులతో గుడిసెలు నిర్మించుకున్నారు.

* ఇక్కడ పిల్లలకు మనలాగా బడులేమీ ఉండవు. సముద్రంలోనే వారి ఆటాపాటా. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లేందుకు, అక్కడక్కడే నీటిలో షికారు కొట్టేందుకు వాళ్లే పడవలు నడిపేస్తుంటారు. ఈతా కొట్టేస్తారు.

* కొంత మంది పిల్ల పిడుగులైతే పెద్దవాళ్లతోపాటు సముద్రం లోతుల్లోకి వెళ్లి చేపలు, ఆక్టోపస్‌ల్లాంటి వాటినీ పట్టేసుకుంటారు.

* వేటాడిన సముద్ర జీవుల్ని దగ్గర్లోని టౌనుకు తీసుకెళ్లి అమ్ముకుంటారు. అక్కడి నుంచి బియ్యంలాంటి సరుకులు తెచ్చుకుని సముద్రంలోని ఇళ్లలోనే వండుకుని తింటారు.

* సముద్రపు అలల్ని బట్టి సమయం ఎంతయ్యిందన్న దాన్నీ వీళ్లు పసిగట్టేస్తారట.

* వీళ్ల విచిత్రమైన జీవనాన్ని చూసేందుకు చాలా మంది అక్కడికి వెళుతుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని