ఈ ఖండానికి టైమే లేదట!
టైమ్జోన్లు ప్రతి దేశానికీ ఉంటాయి... అయితే ఇది లేకుండా ఓ ఖండమే ఉంది... పైగా అక్కడ ఇప్పుడు వేసవి కాలమట... వినడానికే గమ్మత్తుగా ఉంది కదూ! అదేంటో, దాని సంగతులేంటో చూద్దాం రండి... అంటార్కిటికా... ఈ ఖండం పేరు గుర్తుకు రాగానే కనుచూపు మేరంతా...
ఈ ఖండానికి టైమే లేదట!
టైమ్జోన్లు ప్రతి దేశానికీ ఉంటాయి... అయితే ఇది లేకుండా ఓ ఖండమే ఉంది... పైగా అక్కడ ఇప్పుడు వేసవి కాలమట... వినడానికే గమ్మత్తుగా ఉంది కదూ! అదేంటో, దాని సంగతులేంటో చూద్దాం రండి...
అంటార్కిటికా... ఈ ఖండం పేరు గుర్తుకు రాగానే కనుచూపు మేరంతా మేటలుగా పరుచుకున్న మంచే గుర్తొస్తుంది మనందరికీ. అయితే ఇక్కడ ఒక్కశాతం మాత్రం మంచులేని మట్టి భూభాగం కనిపిస్తుంది. ఇది ఎక్కడుందంటే దక్షిణ ధ్రువం దగ్గర. మన దేశం కిందికి దక్షిణవైపుగా చాలా దూరం వెళ్లిపోతే అక్కడ ఉంటుందన్నమాట.
* అంటార్కిటికా ఖండానికి సొంతంగా టైమ్ జోన్ లేదు. అక్కడ స్థానికంగా పుట్టిన వారు ఎవరూ లేకపోవడం, ఏ ఒక్క దేశ ప్రభుత్వం కిందా అది లేకపోవడంతో స్వతహాగా దానికి మాత్రమే ఎవరూ టైమ్‌జోన్‌ని ఏర్పాటు చేయలేదట.
* దీంతో ఇక్కడ చాలా దేశాల టైమ్జోన్లు వాడుకలో ఉన్నాయి.
* ఇక్కడున్న దేశాల బేస్ క్యాంపుల్లో వాళ్ల సొంత దేశపు టైమ్లైన్లనే ఉపయోగించుకుంటారు. మరి కొందరేమో తమ బేస్ క్యాంప్‌కు సమీపంలో ఏ దేశం ఉంటే ఆ టైమ్‌ని వాడతారు. ఉదాహరణకు ఇక్కడ కార్లిన్ బేస్ అని ఒకటుంది. అది అర్జెంటీనా ప్రభుత్వపు అధికారిక బేస్‌క్యాంప్. దీనికి సమీపంలోనే అంటే దక్షిణ అమెరికా ఖండం కొనన అర్జెంటీనా దేశం ఉంటుంది. అది ఈ క్యాంప్‌కు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ టైమ్‌నే ఇక్కడ వాడేస్తారన్నమాట.
విస్తీర్ణం పెరుగుతుంది.. తగ్గుతుంది! అంటార్కిటికా విస్తీర్ణం మొత్తం కోటీ నలభైలక్షల చదరపు కిలోమీటర్లు. అయితే చలికాలంలో ఇక్కడికి దగ్గరగా ఉండే సముద్రాల నీరూ గడ్డకట్టేస్తుంది. దీంతో దీని విస్తీర్ణం ఇంకొన్ని లక్షల చదరపు కిలోమీటర్ల వరకూ పెరిగిపోతూ ఉంటుంది. మళ్లీ వేసవి వచ్చేసరికి ఆ మంచు కరిగిపోయి విస్తీర్ణం మామూలు లెక్కకి వచ్చేస్తుంది. వినేందుకు గమ్మత్తుగా ఉంది కదూ. |
వేసవిలోనే నివాసాలు! * అంటార్కిటికాలోనే పుట్టి పెరిగిన స్థానికులే లేరు. వేసవిలో మాత్రమే ఇక్కడ 4000 మంది నివసిస్తుంటారు. వాళ్లు కూడా వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్లే. |
ఆహారం ఎలా? * ఇక్కడ పంటలు పండవు. మరిక్కడ ఉన్న వాళ్లకు ఆహారం కావాలి కదా. అందుకని వీళ్లు ఏం చేస్తారంటే దక్షిణ ధ్రువంకి దగ్గరగా ఉన్న ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా....లాంటి దేశాల నుంచి ఆహారపదార్థాల్ని ఓడలు, విమానాల్లో తీసుకెళతారు. |
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్‌లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!