రోడ్డును కలుపుతూ ప్రహరీ వద్దు!

మా ఇల్లు రోడ్డు చివర్లో ఉండటం వల్ల ఆ రోడ్డు స్థలాన్ని కలుపుకొని ప్రహరీగోడ నిర్మించాం...

Published : 12 Mar 2016 17:20 IST

రోడ్డును కలుపుతూ ప్రహరీ వద్దు!

మా ఇల్లు రోడ్డు చివర్లో ఉండటం వల్ల ఆ రోడ్డు స్థలాన్ని కలుపుకొని ప్రహరీగోడ నిర్మించాం. దోషమైతే పరిహారమేమిటి?

- రఘునందన్‌, నిజామాబాద్‌ 

మనం తీసుకున్న స్థలం చతురస్రం లేదా దీర్ఘ చతురస్రం.. ఆ చతురస్రంలోని ఒక భుజానికి కచ్చితంగా రోడ్డు ఉండాలని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. అలాకాకుండా ఆ కాలనీలోను, ఆ రోడ్డు చివర ఉన్న ప్లాటు వారు ఆ రోడ్డు ఉపయోగించుకుంటే మనకు మరింత ప్రదేశం కలిసివస్తుందనే ఉద్దేశంతో ఆక్రమించి ప్రహరీ గోడలు నిర్మించి గృహనిర్మాణం చేస్తున్నారు. అది ఉత్తమం కాదు. రోడ్డు కచ్చితంగా ఉండాలి. వీధి మనకు మార్గాన్ని, ప్లానింగ్‌ ఇస్తుంది.అందువల్ల వీధిని కలుపుకోరాదు. ఒకవేళ కలిసి ఉంటే గనక సరిచేసుకొని వీధి ఏర్పడేలా చేసుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని