ఇంటికి లోపల ఫ్లోరింగ్‌ లెవెల్‌ తక్కువ ఉంటే?

గృహనిర్మాణం చేసేప్పుడు అన్ని పనులు పూర్తయ్యాక లోపలి ఫ్లోరింగ్‌, ఆ తరవాత బయటి ఫ్లోరింగ్‌ వేస్తుంటాం. బయట అంటే మెట్లు, వరండా వంటివి! ఇతర నిర్మాణాలూ చేపడుతుంటాం. ...

Published : 20 Jul 2016 23:04 IST

ఇంటికి లోపల ఫ్లోరింగ్‌ లెవెల్‌ తక్కువ ఉంటే?

* మా ఇంటి బయటి ఫ్లోరింగ్‌ లెవెల్‌ కంటే లోపల భాగంలోని నేల తక్కువ ఎత్తులో ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి?

- నాగమణి, తిరుపతి

* గృహనిర్మాణం చేసేప్పుడు అన్ని పనులు పూర్తయ్యాక లోపలి ఫ్లోరింగ్‌, ఆ తరవాత బయటి ఫ్లోరింగ్‌ వేస్తుంటాం. బయట అంటే మెట్లు, వరండా వంటివి! ఇతర నిర్మాణాలూ చేపడుతుంటాం. ఇలాంటి సందర్భంలో లోపలి ఫ్లోరింగ్‌ కంటే బయటి ఫ్లోరింగ్‌ తక్కువ ఎత్తులో ఉండాలి. మనం బయటకు వెళ్లేటప్పుడు దిగుతూ వెళ్లాలి. వచ్చేటప్పుడుఎక్కుతూ ఇంట్లోకి వచ్చే విధంగా వుండాలనేది వాస్తు శాస్త్ర నియమం. ఈ విధంగా కాకుండా బయట ఎత్తుగా, లోపల నేల డౌన్‌గా ఉంటే అభివృద్ధి లోపించే అవకాశం ఉంటుంది. వీలుంటే సరిచేసుకోవాలి. లేకపోతే సింహద్వారం ఉన్న దిక్కున యంత్రాన్ని ప్రతిష్టించుకుంటే దోష పరిహారమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని