ఇంటికి ఐదు ద్వారాలు, ఐదు కిటికీలు ఉంటే దోషమా?

డూప్లెక్స్‌ నిర్మాణం చేసేటప్పుడు.. అంతరంగా నిర్మించే మెట్లను దక్షిణం లేదా పడమర దిక్కులలో నిర్మిస్తే మంచిది. అలాకాకుండా తూర్పు, ఉత్తరం, వాయువ్య దిశల్లో నిర్మించేప్పుడు ఆ గోడకు ....

Published : 13 Sep 2016 16:05 IST


ఇంటికి ఐదు ద్వారాలు, ఐదు కిటికీలు ఉంటే దోషమా?

మా డూప్లెక్సులో మెట్లు ఉత్తరం హద్దుపై ఉన్నాయి. తొలి అంతస్తులో ఐదు ద్వారాలు ఐదు కిటికీలు ఉన్నాయి. ఇలా ఉంటే దోషమా?

- ఆంజనేయులు, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా

డూప్లెక్స్‌ నిర్మాణం చేసేటప్పుడు.. అంతరంగా నిర్మించే మెట్లను దక్షిణం లేదా పడమర దిక్కులలో నిర్మిస్తే మంచిది. అలాకాకుండా తూర్పు, ఉత్తరం, వాయువ్య దిశల్లో నిర్మించేప్పుడు ఆ గోడకు ఆనకుండా కనీసం ఆరంగుళాల ఖాళీ స్థలం ఉంచి మెట్లు కట్టుకోవాలి.అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

అదేవిధంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌ గానీ, ఫస్ట్‌ ఫ్లోర్‌లో గానీ విడివిడిగా సరిసంఖ్యలో ఉండేలా ద్వారాలు, కిటికీలు నిర్మించుకోవాలి. అలాగైతే ఉత్తమ ఫలితాలు వస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని