‘కలౌ వేంకటనాయకా’ అంటే అర్థమేమి?
నాలుగు యుగాల్లో కలియుగంలో పాపాలు ఎక్కువగా వుంటాయి. ఎందుకంటే ధర్మం ఒక్క పాదంతో నడుస్తుంటుంది. కలిపురుషుని ప్రభావంతో అనేక చిత్ర విచిత్రమైన సంఘటనలు సంభవిస్తుంటాయి. మానవులు ధర్మబాటలో నడవకుండా అధర్మప్రచారానికి ప్రభావితమవుతారు...
‘కలౌ వేంకటనాయకా’ అంటే అర్థమేమి?
నాలుగు యుగాల్లో కలియుగంలో పాపాలు ఎక్కువగా వుంటాయి. ఎందుకంటే ధర్మం ఒక్క పాదంతో నడుస్తుంటుంది. కలిపురుషుని ప్రభావంతో అనేక చిత్ర విచిత్రమైన సంఘటనలు సంభవిస్తుంటాయి. మానవులు ధర్మబాటలో నడవకుండా అధర్మప్రచారానికి ప్రభావితమవుతారు. కలియుగంలో మనకు అండగా వుండేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఏడుకొండలపై శ్రీ వేంకటేశ్వరస్వామిగా అవతరించారు. స్వామిని స్మరిస్తేనే పాపాల నుంచి విముక్తి కలిగిస్తాడు. కలియుగ ప్రత్యక్షదైవంగా వుంటూ భక్తుల పాపాలను తొలగిస్తున్న స్వామిని ‘కలౌ వేంకటనాయకా’ అని పిలుస్తారు.
‘సర్వపాపాని వేం ప్రాహుః కట స్తద్దాహ ఉచ్యతే ’ భవిష్యత్పురాణంలో ఇలా పేర్కొన్నారు. అన్ని పాపాలను ‘వేం’ అని అంటారు. కట అంటే తొలగించడం. వేంకట అంటే మన పాపాలను దహించేవాడు. అందుకనే ఆ నారాయణుడిని కలౌ వేంకటనాయకా అని భక్తితో కొలుస్తాము. ‘‘ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే, రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్’’ఈ మంగళశాసనం వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూమండలంలోని తిరునగరిలోని పుష్కరిణిలో విహరించడానికి విచ్చేశారని వెల్లడిస్తోంది. తన భక్తులను స్వయంగా పరిరక్షించేందుకే స్వామివారు వైకుంఠం నుంచి వచ్చి ఆదివరాహ స్వామి వద్ద అనుమతి పొంది నివాసముంటున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయంగా వెలిశారు కనుకనే ఈ తిరుక్షేత్రం లక్షలాది భక్తుల రాకతో దివ్యారామంగా విరాజిల్లుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!