గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి?

సాధారణంగా పండగలు, వేడుకలకు తోరణాలు కడుతుంటాం. ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభకార్యాలు, పండుగలు నిర్వహించరు. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. శుభకార్యాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు. మామిడి ....

Published : 26 Jun 2017 22:26 IST

గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి?

సాధారణంగా పండగలు, వేడుకలకు తోరణాలు కడుతుంటాం. ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభకార్యాలు, పండుగలు నిర్వహించరు. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. శుభకార్యాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది. పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను పోగొట్టేది మామిడాకు తోరణమే. మామిడి కోరికలను తీరుస్తుందని భావిస్తారు. పర్వదినాల్లో, యజ్ఞయాగాల్లో ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీనిని అనుసరించి తోరణాలు కట్టే ఆచారం వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని