ఇది కత్రినా స్టైల్‌

గమనించారా? బాలీవుడ్‌ అమ్మడు కత్రినా కైఫ్‌కి ఈమధ్య అందంపై మరీ శ్రద్ధ పెరుగుతోంది. ‘ఫితూర్‌’ కోసం పదికిలోలు....

Published : 02 Apr 2016 01:34 IST

ఇది కత్రినా స్టైల్‌

మనించారా? బాలీవుడ్‌ అమ్మడు కత్రినా కైఫ్‌కి ఈమధ్య అందంపై మరీ శ్రద్ధ పెరుగుతోంది. ‘ఫితూర్‌’ కోసం పదికిలోలు తగ్గి నాజూగ్గా తయారైనప్పటి నుంచి వస్త్రధారణ విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. సినిమా ప్రచారం, ప్రైవేటు కార్యక్రమం, ఛారిటీ.. సందర్భం ఏదైనా అన్నిచోట్లా తనే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఈ నయా స్టైలిష్‌ స్టార్‌ ఈమధ్యకాలంలో చేసిన సొగసుల మేళాలో కొన్ని పరిశీలిస్తే..మొన్న దిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో డిజైనర్‌ డేవిడ్‌ కోమా రూపొందించిన షీత్‌ డ్రెస్‌ ధరించి అదరగొట్టింది. దానికి జతగా జిమ్మీ చూ స్టిలెట్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతర్జాతీయ డిజైనర్లే కాదు ప్రతిభ ఉన్న స్థానిక డిజైనర్లనూ ప్రోత్సహించడంలో కత్రినా ముందుంటుంది. ధ్రువ్‌కపూర్‌ అలా అవకాశం అందిపుచ్చుకున్నవాడే. తను రూపొందించిన పోల్కా చుక్కల బాడీస్‌ ట్రోజర్‌ని కత్రినా వేసుకుంటే సినీ జనాలంతా ‘ఆహా’ అన్నారు. కాలేజీ అమ్మాయిల నుంచి పార్టీప్రియుల దాకా ఇష్టపడే బోహో లుక్‌ని సైతం ఈ భామ ఆదరించింది. ఇందులోనూ తన ప్రత్యేకత చూపేలా రెబెక్కా టేలర్‌ డిజైన్‌ చేసిన చేతుల్లేని మాక్సీతో ఓ ప్రైవేటు పార్టీలో అందరి చూపునూ తనపై నిలుపుకుంది. ఫ్యాబ్రిక్‌, డిజైన్‌లో తన ప్రత్యేకత చూపించే క్యాట్‌ రంగులతోనూ చెలరేగిపోతోంది. ఫితూర్‌ విజయోత్సవంలో గులాబీ, నారింజ రంగుల మిశ్రమంతో జిల్‌ స్టూవర్ట్‌ డిజైన్‌ చేసిన డ్రెస్‌కి జతగా ఇషార్యా నగలు ధరించి వావ్‌ అనిపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని