logo

రారండోయ్‌.. ఓటేయడానికి ఆంధ్రాకు

ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. 

Updated : 26 Apr 2024 07:34 IST

నగరవాసులకు అక్కడి నేతల పిలుపు

ఈనాడు - హైదరాబాద్‌: ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఓటు ఉండి.. నగరంలో నివాసముంటున్న వారికి ఆంధ్రా నేతల నుంచి ఎన్నికల పిలుపువచ్చింది. ఎంతమంది ఓటర్లున్నారో తెలుసుకుని వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు.

చిరు ఉద్యోగులపైనే దృష్టి : ఉపాధిని వెతుక్కుంటూ నగరానికి వచ్చి స్థిరపడినవారు లక్షల్లో ఉన్నారు. అక్కడ ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందేందుకు వీరిలో చాలామందికి అక్కడి చిరునామాతోనే ఆధార్‌ కార్డులున్నాయి. ఓట్లు కూడా చాలా మందికి నగరంలోనూ, ఏపీలోనూ ఉన్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో ఇళ్లలో పని చేస్తున్నవారు, వాచ్‌మ్యాన్‌లుగా ఉన్నవారితో పాటు వివిధ సంస్థల్లో చిరు ఉద్యోగాలు చేస్తున్న వారిపై అక్కడి నేతలు ప్రధానంగా దృష్టి సారించారు. వారు వచ్చేందుకు ప్రయాణ వనరు కల్పిస్తున్నారు. కొంతమంది సొంతంగా వస్తామంటే.. ప్రయాణ ఖర్చులిస్తున్నారు.  ఇళ్లల్లో పని చేస్తున్నవారు, అపార్టుమెంట్లలో వాచ్‌మెన్లు చాలావరకు ఏపీ వాళ్లున్నారు. వారంతా  రెండ్రోజుల ముందే వెళ్తామని యజమానులను అనుమతులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని