నీళ్లపై ‘సైకిల్‌’ ప్రయాణం

వెరైటీ నీళ్లపై తిరిగే కార్లు, బస్సులు చూశాం. సముద్రాలు, నదులపై దిగే విమానాల గురించి విన్నాం. మరి వీటిల్లో ప్రయాణించాలంటే ఖర్చు చాలా ఎక్కువ. తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండి.....

Published : 17 Feb 2018 01:32 IST

నీళ్లపై ‘సైకిల్‌’ ప్రయాణం
వెరైటీ

నీళ్లపై తిరిగే కార్లు, బస్సులు చూశాం. సముద్రాలు, నదులపై దిగే విమానాల గురించి విన్నాం. మరి వీటిల్లో ప్రయాణించాలంటే ఖర్చు చాలా ఎక్కువ. తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండి... నీటిపై నడిచే సైకిల్‌ ఉంటే ఎంత బాగుంటుంది. హాయిగా చెరువులు, కాలువలు దాటేయొచ్చు. మరి అలాంటి ఆలోచనతోనే ముందుకొచ్చాడో యువకుడు ఫ్రాంకో డార్క్‌.విద్యార్థులు రోజూ పాఠశాలకు వెళ్లడానికి చెరువులు, కాలువలు దాటాలంటే ఎంత కష్టం? తమ దేశంలో ఇలాంటి పరిస్థితులను గమనించిన ఘనాలోని టాక్‌రాడికి చెందిన ఫ్రాంకో నీటిపై నడిచే సైకిల్‌ను తయారు చేశాడు. 6 నెలలు కష్టపడి రూ.6500 వ్యయం చేసి దీన్ని రూపొందించాడు. బెండ్లు, అల్యూమినియం, చెక్క ఉపయోగించాడు. బెండ్లు సైకిల్‌ను నీటిపై తేలేలా చేస్తే.... రిమ్ముకు ఉండే తెడ్డులాంటి ప్రొపెల్లర్లు వాహనాన్ని ముందుకు కదిలేలా చేస్తాయి. చెరువులు, కుంటలు, కాలువలు ఎదురైనా ఈ సైకిల్‌ తొక్కుకుంటూ అవతలి గట్టుకు చేరుకోవచ్చు. దీన్ని ఇంకొంచెం మెరుగుపరచాల్సి ఉందని, ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే... ఇలాంటి సైకిళ్లను మా దేశంలో కష్టపడుతున్న విద్యార్థులందరికీ అందిస్తానని చెబుతున్నాడు ఫ్రాంకో డార్క్‌. దుస్తులు, పుస్తకాలు మోసుకుంటూ... నీళ్లలో తడుచుకుంటూ ప్రమాదకర పరిస్థితుల మధ్య బడికి వెళ్లే మన దేశంలోని పిల్లలకూ ఇది ఎంతో ఉపయోగం కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని