‘సుదు’గాలి

నలుపు రంగులో ఉండదా? అనే ఆలోచనను రేకెత్తిస్తున్న ఈ బ్లాక్‌....

Published : 10 Mar 2018 01:38 IST

సెన్సేషనల్‌
‘సుదు’గాలి

అందమంటే.. తెలుపు రంగులోనే ఉంటుందా?
లుపు రంగులో ఉండదా? అనే ఆలోచనను రేకెత్తిస్తున్న ఈ బ్లాక్‌ బ్యూటీ పేరు సుదు గ్రామ్‌. 69.8 వేల మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు ఉన్న సుదు ప్రస్తుతం సోషల్‌మీడియా సెన్షేషనల్‌. నమ్మలేని నిజమేంటంటే ఈ బ్లాక్‌ బ్యూటీ నిజమైన మోడల్‌ కాదు.. ప్రపంచంలోని తొలి డిజిటల్‌ సూపర్‌మోడల్‌!
తాజాగా ఇంటర్నెట్‌లో ఎక్కువగా షేర్‌ అవుతున్న ఫొటో ఇదే. ఈ డిజిటల్‌ మోడల్‌కు రాకెట్‌ వేగంతో ఇన్‌స్టాగ్రమ్‌ ఫాలోవర్లు పెరుగుతున్నారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో డిష్కషన్స్‌ నడుస్తున్నాయి. మేకప్‌, హెయిర్‌, ఫొటోలోని జీవం చూసి..‘టూ పర్ఫెక్ట్‌ టు బి రియల్‌’ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఫొటోను లండన్‌కి చెందిన ఫొటోగ్రాఫర్‌ కామరూన్‌ జేమ్స్‌ విల్సన్‌ గ్రాఫిక్స్‌లో సృష్టించాడు.‘డార్క్‌ స్కిన్‌ మోడల్స్‌ విప్లవం చూసి స్ఫూర్తి పొంది ఈ డిజిటల్‌ మోడల్‌ను క్రియేట్‌ చేశాను. దురదృష్టవశాత్తూ ఇది నిజం మోడల్‌ కాదు’ అంటున్నాడు కామెరూన్‌. కళపై ప్రేమతో సహజంగా ఉండాలని  ఆయన ఈ మోడల్‌ను క్రియేట్‌ చేశాడు. ఈ డిజిటల్‌ మోడల్‌ 2,762 అమెరికన్‌ డాలర్ల ధర పలికింది. కమర్షియల్‌గా ఏదో సంపాదించాలని ఈ బొమ్మను సృష్టించలేదు అంటోన్న జేమ్స్‌కి నెటిజన్లు జేజేలు కొడుతున్నారు. నలుపు చర్మాన్ని మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో గ్లామరైజ్‌ చేసినందుకు ధన్యవాదాలంటూ ఫ్యాషన్‌ ప్రియులు ప్రశంసిస్తున్నారు. డిజిటల్‌ బ్లాక్‌ బ్యూటీ సుదును చూసి ‘భవిష్యత్‌లో విర్చువల్‌ మోడల్స్‌ ప్రపంచాన్ని ఏలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది కొందరి భావన. దీనికి సుదు సృష్టిస్తున్న సుడిగాలే నిదర్శనం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని