ఎప్పుడూ బ్లూనేనా?
ఎప్పుడూ బ్లూనేనా?
జీన్స్ అంటే బ్లూ... ఇంకొంచెం ట్రై చేస్తే బ్లాక్, గ్రే దొరుకుతాయి. ఎన్ని రోజులనీ ఈ జీన్స్ వేసుకోవాలి? బ్లూ, బ్లాక్, గ్రేల్లోనే కొంచెం అటుఇటుగా... ఇవే రంగులు ఇంకా ఎన్నేళ్లు? ఇలా ప్రశ్నించే యువతను ఆకట్టుకోవడానికి జీన్స్ తయారు చేసే కంపెనీలు కొత్తగా సమాధానం ఇస్తున్నాయి. రంగురంగుల డెనిమ్స్‌తో స్వాగతమంటున్నాయి. చాలాకాలంగా బ్లూజీన్సే మార్కెట్టును శాసిస్తున్నాయి. మారుతున్న కాలానికి తగ్గట్లు వీటిల్లోనూ మార్పులు తప్పడం లేదు. మిలియనిల్స్, జనరేషన్ జెడ్ కాలమిది. వీరు వీటిపై ఎక్కువగా మక్కువ చూపడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ డిజైనర్లు, కంపెనీలు పునరాలోచనలో పడ్డారు. మార్పు తప్పదని, లేకపోతే జీన్స్ మార్కెట్టు పడిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు. అందుకే కొత్త రంగులను రంగంలోకి దించారు. రెడ్, ఎల్లో, క్రీమ్, గ్రీన్, మిల్క్‌రెడ్ వంటి రంగుల్లో జీన్స్‌ను మార్కెట్లోకి వదిలారు. డ్యూయల్ కలర్డ్, మల్టీ కలర్డ్, ఫ్లవర్డ్, మిలటరీ షేడ్స్ వంటివీ అందుబాటులో ఉంచారు. దీంతో యువత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లలో వీటి కోసమే వెదుకులాట మొదలుపెట్టారు. కొత్తగా కన్పించడానికి సిద్ధమవుతున్నారు.
సన్నగా ఉంటే : సన్నగా ఉన్నప్పుడు స్లిమ్‌ఫిట్ జీన్స్ ధరించక పోవడం మేలు. దీనివల్ల మరింత సన్నగా కన్పిస్తారు. అందుకే వీరు ప్యార్లల్ కట్, క్యాజువల్ ఫిట్‌లకు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది. పైగా వీటిపైకి వేసుకొనే షూ కొంచెం పెద్దగా కన్పించేవి ధరిస్తే ఎలివేట్ అవ్వొచ్చు. జేబులు(ప్యాకెట్లు) ఎక్కువగా ఉంటే బయటికి సన్నగా కన్పించే అవకాశాలు తక్కువ. ముదురు రంగులతో కొత్త లుక్‌లోకి మారిపోవచ్చు.
లావుగా ఉన్నా : జీన్స్‌లో ఉండే మహిమే అది ఎంత బొద్దుగా ఉన్నా జీన్స్ వేసుకోవచ్చు. స్ట్రెచ్‌బుల్ టైట్ ఫిట్ జీన్స్‌లో భిన్నరంగులను ఎంచుకుంటే నప్పుతాయి. లావుగా కన్పించకుండా ఉండేందుకు దాదాపు స్కిన్‌టైట్ ప్యాంట్లే ఎంచుకోవాలి. తగిన ఫార్మల్ షూ వేసుకుంటే మరింత అందంగా మెరిసిపోవచ్చు. లేత రంగులు ఇలాంటి వారికి వన్నె తెస్తాయి.
ఫిట్‌నెస్సే... హ్యాండ్సెమ్ : రోజూ వ్యాయామం చేసి, డైట్ పాటించేవాళ్లు సాధారణంగానే ఫిట్‌గా ఉంటారు. వీరికి ఈ జీన్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. టీషర్ట్, షర్ట్, కుర్తా, ఇలా ఏది వేసినా సూటవుతుంది. శరీరం సరైన ఆకృతిలో ఉంటుంది కాబట్టి... సహజంగానే అందంగా కన్పిస్తారు. సరైన డార్క్, లైట్ రంగుల్లో అందరినీ ఆకట్టుకోవచ్చు.
మల్టీ కలర్డ్ : అమ్మాయిల లుక్‌కి ఇవి బాగా సరిపోతాయి. ప్లెయిన్ షర్ట్స్ ధరించి ఈ జీన్స్‌లు వేస్తే అదిరిపోతుందంతే. కుర్తీల్లో టాప్ కట్‌లు వీటిపైకి బాగుంటాయి. లూజ్ హెయిరిచ్చి, హైహీల్‌తో ఫంక్షన్‌కు హాజరైతే మిమ్మల్ని చూడని కళ్లుండవు. వీకెండ్స్, నైట్‌అవుట్లలో మెప్పిస్తాయి. మల్టీకలర్డ్ జీన్స్‌ల్లో బెల్‌బాటమ్ వేసుకొని లుక్కే కొత్తగా మార్చుకోవచ్చు. కాఫ్‌లెంగ్త్ బాటమ్స్ ఈ రంగుల్లో ట్రై చేయొచ్చు.
రంగుతో పనేముంది? ఇప్పుడు నల్లగా ఉన్న వారు ఈ రంగులే వాడాలని, తెల్లగా ఉన్న వారు ఇలాంటివే ధరించాలనే నిబంధనలు లేవు. అందరూ అన్ని రంగులు ధరించడానికి ఇష్టపడుతున్నారు. అయితే దానిపై వేసుకొనే షర్ట్, టీషర్ట్ తగిన విధంగా ఉండేట్లు చూసుకుంటే చాలంటున్నారు డిజైనర్లు. నైట్ పార్టీలు, సంప్రదాయ వేడుకలు, పెళ్లిళ్ల సమయంలో రంగురంగుల జీన్స్ బాగా నప్పుతాయి. టోర్న్, ప్యాచ్ మోడల్స్ వీటిల్లో ఫాలో అవ్వొచ్చు. కార్యాలయాలకు వెళ్లేవారు మాత్రం వీటికి దూరంగా ఉంటేనే మంచిదంటున్నారు డిజైనర్ నిపుణులు. |
- రవి అవ్వారు, అవ్వారు డిజైన్స్
|
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Parliament: ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం
-
India News
Aadhaar-PAN: ఆధార్-పాన్ లింకు డెడ్‌లైన్ పొడిగించండి.. మోదీకి కాంగ్రెస్ లేఖ
-
Sports News
Venkatesh Prasad: కేఎల్ రాహుల్ పట్ల నేను కఠినంగా ప్రవర్తించలేదు : వెంకటేశ్ ప్రసాద్
-
World News
చైనా చొరబాటుపై అమెరికా ముందే చెప్పిందా..? శ్వేతసౌధం స్పందన ఇదే..!
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీ20లు ఆడటం ఆపేయ్: షోయబ్ అక్తర్
-
India News
Death Penalty: ‘ఉరి’ విధానం క్రూరమైందా..? సుప్రీంకోర్టు ఏమంటోంది..!