వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్‌ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

Published : 05 May 2024 07:58 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్‌ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాజుపేటలో వీధికి ఓవైపు తెలంగాణలోని మహబూబాబాద్‌ లోక్‌సభ, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోక్‌సభ పరిధిలోకి వెళ్లాయి. శ్రీనివాస్‌ ఇల్లు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు లోక్‌సభ స్థానం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చేరింది.

గ్రామం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరు సుమారు 270 కి.మీ. దూరం ఉంటుంది. శ్రీనివాస్‌ కుమారుడు జానకీరామ్‌ అదే వీధిలో రోడ్డుకు అవతలి వైపు స్థలం కొనుగోలు చేసి.. భవనం నిర్మించుకుంటున్నారు. దీంతో తండ్రి నివాసం ఏపీలో ఉండగా.. కుమారుడిది తెలంగాణలో ఉండనుండటం విశేషం.      

ఈనాడు, వరంగల్‌, భద్రాచలం, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని