viral video: టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్‌.. వీడియో వైరల్‌

స్కూల్‌కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్‌ ఓ టీచర్‌ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. 

Published : 05 May 2024 00:07 IST

లఖ్‌నవూ: స్కూల్‌కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్‌ టీచర్‌ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆగ్రా, సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి తరచూ పాఠశాలకు ఆలస్యంగా వస్తుండడంపై ప్రిన్సిపల్‌ ఆమెతో వాదనకు దిగారు. టీచర్‌ తిరిగి జవాబు ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఊగిపోయిన ప్రిన్సిపల్‌ ఆ టీచర్‌పై దాడి చేశారు. అంతటితో ఆగకుండా దుస్తులను చింపేందుకు ప్రయత్నించారు. మొదట వారిద్దరిని వారించడానికి ప్రయత్నించిన ప్రిన్సిపల్‌ డ్రైవర్‌ సైతం టీచర్‌తో వాగ్వాదానికి దిగాడు. 

ఈ ఘటనను పాఠశాలలోని మరో టీచర్‌ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్త వైరల్‌గా మారింది. అందులో ఇతర టీచర్లు కూడా  ప్రిన్సిపల్‌ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, ఆమె స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదని ఆరోపించారు. ఈ ఘటన అనంతరం ప్రిన్సిపల్‌ సదరు టీచర్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇటీవల ఇదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్కూల్‌లో ఫేషియల్ చేయించుకుంటున్న ప్రధానోపాధ్యాయురాలి వీడియో తీసినందుకు ఓ టీచర్‌ను ప్రిన్సిపల్‌ తీవ్రంగా కొట్టిన ఘటన చోటుచేసుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని