AP Cabinet: రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 10 Oct 2025 18:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: మొత్తం రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. విజయనగరంలో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు, ఓర్వకల్లులో రిలయన్స్‌ కన్జ్యూమర్‌ ప్రాజెక్టుకు, పర్యాటక ప్రాంతాల్లో స్టార్‌ హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదించింది. శ్రీశైలం ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, సబ్సిడీలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మరిన్ని కేబినెట్‌ నిర్ణయాలు

  • ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం
  • పర్యాటక అభివృద్ధి కోసం పలు పెట్టుబడులకు ఆమోదం
  • రూ.87 వేల కోట్లతో విశాఖలో 3 ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు కేబినెట్‌ అనుమతి
  • గూగుల్‌ డేటా సెంటర్‌కు 480 ఎకరాల కేటాయింపునకు ఆమోదం
  • ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద రూ.1,200 కోట్లతో బీడీఎల్‌ ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీకి ఆమోదం
  • గ్రామ పంచాయతీల పునఃవర్గీకరణకు కేబినెట్‌ ఆమోదం
  • పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం
  • 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చేందుకు ఆమోదం
  • ఆదాయాన్ని బట్టి పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజన
  • పంచాయతీ సెక్రెటరీలను.. పంచాయతీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా మార్చేందుకు ఆమోదం
  • అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్‌భవన్‌ నిర్మాణానికి ఆమోదం
Tags :
Published : 10 Oct 2025 16:45 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు