Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు దంపతులకు లండన్‌లో ఘన స్వాగతం

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu).. సతీమణి భువనేశ్వరితో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులకు అక్కడి తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. తెలుగు వారిని చంద్రబాబు దంపతులు ఆప్యాయంగా పలకరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వరికి ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్’ (ఐఓడీ) సంస్థ 2025 సంవత్సరానికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును నవంబరు 4న లండన్‌లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్‌కు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డునూ ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వరి అందుకోనున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ, సామాజిక సాధికారతకు పాటుపడుతున్నందుకు భువనేశ్వరిని విశిష్ట వ్యక్తిగా గుర్తిస్తూ ఐఓడీ సంస్థ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందిస్తోంది. ఈ కార్యక్రమం లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్‌లో జరగనుంది. గతంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో ఛైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ఛైర్పర్సన్ రాజశ్రీ బిర్లా తదితరులు ఈ అవార్డును అందుకున్నారు. వ్యక్తిగత పర్యటన తర్వాత సీఎం లండన్ పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. నవంబరు 6న ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు.


Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

దుబాయిలోని ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులతో మంత్రి నారాయణ బృందం భేటీ
ఏపీ మంత్రి నారాయణ బృందం దుబాయిలో పర్యటిస్తోంది. తొలి రోజు దుబాయిలోని ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులు బీజీ కృష్ణన్, సెలీనా శశికాంత్‌తో మంత్రి భేటీ అయ్యారు. - 
                                    
                                        

నెల్లూరు జిల్లా జైలుకు మాజీ మంత్రి జోగి రమేశ్
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో వారిద్దర్నీ విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. - 
                                    
                                        

బీసీల గురించి మాట్లాడే అర్హత జోగి రమేశ్‌కు లేదు: కొల్లు రవీంద్ర
కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ను పూర్తి సాక్ష్యాలతో పోలీసులు అరెస్టు చేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. - 
                                    
                                        

ఉద్యోగాల పేరిట రూ.5 కోట్లు వసూలు.. విడదల రజని అనుచరులపై ఫిర్యాదు
మాజీ మంత్రి, వైకాపా నేత విడదల రజని పీఏ, అనుచురులపై దోర్నాలకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థి కృష్ణ, మరికొందరు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. - 
                                    
                                        

కార్తిక మాసం రద్దీ.. ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతపై పవన్ కీలక ఆదేశాలు
పవిత్ర కార్తిక మాసం(Karthika Masam) సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సూచించారు. - 
                                    
                                        

అప్పలరాజు మాస్టారూ.. మీ కళాత్మక బోధనా శైలి చూడముచ్చటగా ఉంది: మంత్రి లోకేశ్
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు బల్లెడ అప్పలరాజును మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అభినందించారు. - 
                                    
                                        

మంత్రి అనిత మానవత్వం.. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలించి!
రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో వైద్య సహాయం అందేలా చేసి ఏపీ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు.
 - 
                                    
                                        

కార్తిక సోమవారం.. ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ
కార్తిక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజామునుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. విజయవాడ దుర్గా ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి, అభిషేకాలు నిర్వహించారు. దీంతో అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
 - 
                                    
                                        

ఆధారాలతో బయటపడిన అసలు రంగు
తామే నకిలీ మద్యం వ్యవహారాన్ని వెలికి తీయించామని.. మేం లేకపోతే కూటమి ప్రభుత్వం నీరుగార్చేది అంటూ ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం యూనిట్, సీసాలను స్వాధీనం చేసుకున్న సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడకు వచ్చి నానా యాగీ చేశారు. - 
                                    
                                        

అన్నపూర్ణ భర్తకు నైవేద్యాలకు కొదవా?
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని సీతారామాలయంలో శనివారం రాత్రి గౌరీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. - 
                                    
                                        

జాతీయ రహదారి 2 నెలలకే.. రెండు ముక్కలు!
కొత్తగా వేసిన రోడ్డుపై రాకపోకలు ప్రారంభించి రెండు నెలలైనా కాలేదు. అప్పుడే పగుళ్లిచ్చింది. దీంతో వివిధ సాకులతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. - 
                                    
                                        

బాపట్ల జిల్లాలో కారు, లారీ ఢీ.. నలుగురు మృతి
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేటలో ఆదివారం అర్ధరాత్రి దాటక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. - 
                                    
                                        

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌కు రిమాండ్
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌కు ఈ నెల 13 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. - 
                                    
                                        

రాయిచేప అందం.. ముళ్లకప్ప చందం
విశాఖలోని రుషికొండ బీచ్ సమీప సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు విభిన్న రకాల జీవులు చిక్కాయి. ఆకర్షణీయంగా పసుపు తోక కలిగిన రాయి చేపలతో పాటు ములుగుపాములు, ముళ్లకప్పలు లభ్యమయ్యాయి. - 
                                    
                                        

జోగి పాత్ర తేలడంతోనే అరెస్టు: ఎక్సైజ్ మంత్రి రవీంద్ర
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టయ్యారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. - 
                                    
                                        

సచిన్‌ను కలిసిన లోకేశ్ దంపతులు
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ను కలిశారు. ‘‘ఇది ఫ్యాన్ బాయ్ క్షణం. ఈ రోజు లెజెండ్‌ను కలిసే అదృష్టం లభించింది. ఆయన వినయం, ఆప్యాయతల గురించి ఇప్పటి వరకూ వినడమే. - 
                                    
                                        

తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు
కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. - 
                                    
                                        

బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. - 
                                    
                                        

శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఆదివారం వైభవంగా జరిగింది. - 
                                    
                                        

అన్నవరంలో వైభవంగా తెప్పోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

కప్పు గెలిచినా.. మిమ్మల్ని ఎప్పటికీ మరవం..
 - 
                        
                            

దుబాయిలోని ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులతో మంత్రి నారాయణ బృందం భేటీ
 - 
                        
                            

నెల్లూరు జిల్లా జైలుకు మాజీ మంత్రి జోగి రమేశ్
 - 
                        
                            

ఒడుదొడుకులు ఎదుర్కొని.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
 - 
                        
                            

‘మా కూతురు.. చెక్క బ్యాట్, వస్ర్తంతో చేసిన బంతితో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది’
 - 
                        
                            

ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్‌రెడ్డి
 


