Chandrababu: సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు.. సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశం

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 16 Jun 2025 16:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటనలకు తరచూ వాడే హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఆదేశించారు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు వెళ్తున్నప్పుడు జీఎంఆర్‌ సంస్థకు చెందిన హెలికాప్టర్‌ను వాడుతుంటారు. అయితే, ఈ హెలికాప్టర్‌తో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 

తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌.. అమరావతి నుంచి ఆ హెలికాప్టర్‌లోనే తిరుపతి వెళ్లారు. అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు ఇదే హెలికాప్టర్‌లో వెళ్లేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. అయితే, ఆయన తిరుపతిలో హెలికాప్టర్‌ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపం బయటపడింది. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పర్యటనను కేంద్ర మంత్రి రద్దు చేసుకున్నారు. తరచూ ఈ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో హెలికాప్టర్‌ వినియోగించవచ్చా? లేదా?స్పష్టంగా పేర్కొంటూ ఒక నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని