Chandrababu Arrest: ‘నా పెద్ద కొడుకు’ అరెస్టుతో ఆకలి, నిద్ర ఉండడం లేదు

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లిలో తెదేపా శ్రేణులు ‘బాబుతో నేను’ ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించాయి.

Updated : 27 Sep 2023 09:52 IST

నీలపల్లికి చెందిన వృద్ధురాలి ఆవేదన

తాళ్లరేవు, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లిలో తెదేపా శ్రేణులు ‘బాబుతో నేను’ ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించాయి. ఈ సందర్భంగా నీలపల్లికి చెందిన వృద్ధురాలు మాదాసు సుందరమ్మకు కరపత్రం అందించి, చంద్రబాబు అరెస్టు గురించి చెప్పడంతో ఆమె ఆవేదనకు గురయ్యారు. నా పెద్ద కొడుకు లాంటి చంద్రబాబును అరెస్టు చేసినప్పట్నుంచి నిద్ర, ఆకలి ఉండడంలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయన చేసిన తప్పేంటో చూపించాలని ఆగ్రహంతో ప్రశ్నించారు. చంద్రబాబు అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయన ఎందరినో ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు తప్పక విడుదలవుతారని నాయకులు ఆమెను ఓదార్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు