‘ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఛైర్మన్‌ని విధుల నుంచి తప్పించండి’

రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్‌ఎఫ్‌) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 05:36 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్‌ఎఫ్‌) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆయన్ను ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)కి శనివారం లేఖ రాశారు. ‘హేమచంద్రారెడ్డి.. ప్రొఫెసర్‌ ముసుగులో ఉన్న వైకాపా కార్యకర్త. తన అస్మదీయులను విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులుగా నియమించి, ఆయా వర్సిటీల్లో 500 మంది విద్యార్థుల చొప్పున వైకాపా ప్రచారానికి సమీకరించి సర్వే చేయించారు. కళాశాలల యాజమాన్యాలకు ఫోన్‌ చేసి ఎన్నికల్లో వైకాపాకు మద్దతివ్వాలని, విద్యార్థులు, తల్లిదండ్రుల్ని చైతన్యవంతుల్ని చేయాలని ఆదేశిస్తున్నారు’ అని శ్రీరాములు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని