Gautam Adani: గౌతమ్‌, సాగర్‌ అదానీలపై లంచం అభియోగాల్లేవ్‌: అదానీ గ్రీన్‌

Eenadu icon
By Business News Team Updated : 27 Nov 2024 09:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: అదానీ, దాని అనుబంధ సంస్థలు.. సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు పెద్దఎత్తున లంచాలు ఆఫర్‌ చేశారన్న ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదవడం ఇటీవల సంచలనంగా మారింది.  ఈ వ్యవహారంపై తాజాగా అదానీ గ్రూప్‌ (Adani Group)నకు చెందిన గ్రీన్‌ఎనర్జీ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ కేసుకు సంబంధించి గౌతమ్‌ అదానీ (Gautam Adani), ఆయన బంధువు సాగర్‌లపై లంచం అభియోగాలు నమోదైనట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని వెల్లడించింది.

ఈమేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌ సందర్భంగా అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (Adani Green Energy Ltd) దీనిపై స్పందించింది. ‘‘అమెరికా ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌ (FCPA) కింద గౌతమ్‌ అదానీ, ఆయన బంధువు సాగర్‌, కంపెనీ సీనియర్‌ డైరెక్టర్‌ వినీత్ జైన్‌పై లంచం, అవినీతి అభియోగాలు నమోదైనట్లు వచ్చిన కథనాలను మేం తిరస్కరిస్తున్నాం. అవన్నీ అవాస్తవం. వీరంతా సెక్యూరిటీస్‌ సంబంధించిన మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారే తప్ప వారిపై లంచం, అవినీతి అభియోగాలు ఏవీ నమోదు కాలేదు. ఎఫ్‌సీపీఏ నిబంధనలు ఉల్లంఘించారని అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో ఈ ముగ్గురు పేర్ల ప్రస్తావన లేదు’’ అని అదానీ గ్రీన్‌ పేర్కొంది.

అదానీ కంపెనీలు, బాండ్ల రేటింగ్‌లో కోత

అదానీ, సాగర్‌ అదానీతో పాటు ఆరుగురు 2020-24 మధ్య కాలంలో భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్‌ డాలర్ల (రూ.2,200 కోట్ల) లంచాలు ఇచ్చేందుకు అంగీకరించారని న్యూయార్క్‌ కోర్టులో వారిపై నేరారోపణ నమోదైంది. లాభదాయకమైన సౌర విద్యుత్‌ సరఫరా ఒప్పందాలను పొందేందుకు ఈ లంచాలు ఇచ్చారనేది అభియోగం. అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌లు గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీ, అజూర్‌ పవర్‌ గ్లోబల్‌ ఎగ్జిక్యూటివ్‌ సిరిల్‌ కాబనేస్‌లపై యూఎస్‌ ఎస్‌ఈసీ అభియోగాలు మోపింది. ఈక్రమంలోనే ఇటీవల గౌతమ్‌, సాగర్‌కు యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (యూఎస్‌ ఎస్‌ఈసీ) సమన్లు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా.. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ ఖండించింది. దీనిపై న్యాయపరంగా ముందుకువెళ్తామని వెల్లడించింది.

Tags :
Published : 27 Nov 2024 09:17 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు