Apple: హోమ్‌ రోబోటిక్స్‌ విభాగంలో యాపిల్‌..?

Apple: ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ హోమ్‌ రోబోటిక్స్‌ విభాగంలో అడుగుపెట్టినట్లు బ్లూమ్‌బర్గ్‌ ఓ కథనాన్ని ప్రచురింది.

Updated : 05 Apr 2024 15:15 IST

Apple | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆటో మొబైల్‌ విభాగంలో అడుగుపెట్టేందుకు ‘ప్రాజెక్ట్‌ టైటన్‌’ పేరిట కసరత్తు చేసిన యాపిల్‌ (Apple).. చివరకు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. అనివార్య కారణాలతో స్మార్ట్‌ కార్‌ ప్రాజెక్ట్‌కు స్వస్తి పలికింది. ఇప్పుడు టెక్‌ దిగ్గజం తాజాగా హోమ్‌ రోబోటిక్స్‌ (home robotics) విభాగంలో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు బ్లూమ్‌బర్గ్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

యాపిల్‌ తీసుకురానున్న ఈ రోబో యజమానిని అనుసరిస్తూ.. వారికి పనులు చేయడంలో సాయపడుతుంది. ఇంటి పనుల్లో తోడ్పడుతుంది. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు డిస్‌ప్లే చూపిస్తుంది. ఈ రోబో రెండు చేతులు, ఒక డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. యాపిల్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ విభాగాలు ఈ ప్రాజెక్ట్‌పై పని చేయనున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆరంభ దశలోనే ఉందని, దీనిపై యాపిల్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు ఇక సులువు.. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కొత్త యాప్‌

యాపిల్‌ పరిశోధనపై పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంటుంది. ప్రాజెక్ట్‌ వల్ల లాభనష్టాలను బేరీజు వేసుకుంటుంది. తీరా ప్రాజెక్ట్‌ తుది దశకు చేరినా అవసరం లేదనుకుంటే ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. ఈ తరహాలో స్మార్ట్‌ కారు, డిస్‌ప్లే ప్రాజెక్టులను యాపిల్ పక్కనపెట్టింది. ఇందులోభాగంగా యాపిల్ దాదాపు 600 మంది ఉద్యోగులను తాజాగా విధుల నుంచి తొలగించింది. కొత్త తరం స్క్రీన్‌ డెవలప్‌మెంట్‌పై పనిచేస్తున్న 87 మందితో పాటు.. కారు ప్రాజెక్టు నుంచి వీరిని తీసేసినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని