ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు ఇక సులువు.. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కొత్త యాప్‌

ప్రభుత్వ బాండ్లలో సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం సులభతరం కానుంది. ఇందుకోసం త్వరలో ఓ యాప్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకురానుంది.

Published : 05 Apr 2024 13:59 IST

Govt bonds | ముంబయి: ప్రభుత్వ బాండ్లు లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు కానుంది. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కొత్తగా ఓ మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి రాబోతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) త్వరలో దీన్ని తీసుకురాబోతోంది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ను 2021 నవంబర్‌లో ప్రారంభించింది. ఆర్‌బీఐ డైరెక్ట్‌ పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం ప్రైమరీ, సెకండరీ మార్కెట్‌ ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేయొచ్చు. రిటైల్‌ ఇన్వెస్టర్లు వేలంలో ఈ సెక్యూరిటీలను అమ్మడం/కొనడం చేయొచ్చు.

ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులను మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశంలో రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌కు సంబంధించిన మొబైల్‌ అప్లికేషన్‌ను తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. పరపతి విధాన నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు. యాప్ సిద్ధమవుతోందని, త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పారు. ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ నుంచి రూ.14.13 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో తొలి అర్ధభాగంలోనే రూ.7.5 లక్షల కోట్లు సేకరించాలనుకుంటోంది.

ఏడోసారీ వడ్డీరేట్లు యథాతథం

మరోవైపు సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని మరింత విస్తృత పరచాలన్న ఉద్దేశంతో ఆర్‌బీఐ మరో నిర్ణయం తీసుకుంది. నాన్‌ బ్యాంక్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్లూ డిజిటల్‌ కరెన్సీ వాలెట్‌ను అందించే సదుపాయం తీసుకొస్తోంది. ప్రస్తుతం రిటైల్‌, హోల్‌సేల్‌ విభాగంలో బ్యాంకులు పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలను అందిస్తున్నాయి. సీబీడీసీ- రిటైల్‌ వినియోగాన్ని మరింత పెంచాలన్న ఉద్దేశంతో నాన్‌ బ్యాంక్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్లు కూడా సీబీడీసీ వాలెట్లను అందించనున్నాయని శక్తికాంత దాస్‌ తెలిపారు. ఇందుకు అవసరమైన మార్పులు చేయబోతున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని