Apple: AIపై యాపిల్‌ ఫోకస్‌.. ఐఓఎస్‌ 18లో కీలక మార్పులు!

Apple: ఏఐపై యాపిల్ దృష్టి సారించింది. ఐఓఎస్‌ 18లో కీలక మార్పులు చేపట్టనుంది. యాపిల్‌ చరిత్రలో ఐఓఎస్‌ పరంగా ఇదే అప్‌డేట్‌ కానుంది.

Updated : 30 Jan 2024 19:55 IST

Apple | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వేగంగా అన్ని పరికరాల్లోకి చేరుతోంది. మారుతున్న వినియోగదారుల అభిరుచుల మేరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల్లో ఏఐని జోడిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దిగ్గజ సంస్థలు తమ పరికరాల్లో ఏఐ సాంకేతికతను తీసుకొచ్చాయి. పలు మొబైల్‌ కంపెనీలు కొత్తగా లాంచ్‌ చేసిన తమ స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ ఫీచర్లను అందించాయి. ఇప్పుడు యాపిల్‌ (Apple) దీనిపై దృష్టి సారించి కొత్తగా తీసుకురానున్న ఐఓఎస్‌ 18లో ఏఐ ఆధారిత ఫీచర్లను జోడించనుంది.  

ఈ ఏడాది చివరికి యాపిల్‌ ఆవిష్కరించనున్న ఐఫోన్ 16 సిరీస్‌లో జనరేటివ్ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. మార్కెట్లోకి విడుదలైన గూగుల్ పిక్సెల్ 8 (Pixel 8), శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 (Galaxy S24) సిరీస్‌లు ఏఐ ఆధారిత టూల్స్, యాప్‌లతో వచ్చాయి. యాపిల్‌ మాత్రం ఈ విషయంలో వెనుకంజలో ఉంది. ఐఓఎస్‌ 18 (iOS 18)తో ఆ లోటు తీర్చనుంది.   ఈ ఏడాది రానున్న 16 సిరీస్‌ మొబైల్స్‌లో ఈ సదుపాయం ఉండనుందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ చరిత్రలోనే iOS 18 అతిపెద్ద ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్‌గా నిలవనుందని బ్లూమ్‌బర్గ్‌ తన నివేదికలో పేర్కొంది.

విలీన ఒప్పందం రద్దు.. సోనీకి NCLT నోటీసులు

ప్రస్తుతం యాపిల్‌లో ఉండే ‘సిరి’ డివైజ్‌ అసిస్టెంట్‌లోనే ఏఐ పరంగా కీలక మార్పులు తీసుకురానున్నారు. యాపిల్‌ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (LLM) ద్వారా దీన్ని పునరుద్ధరించాలని భావిస్తున్నారు. ఏఐ యాపిల్‌ మ్యూజిక్‌, మెసేజెస్‌ వంటి ఇతర యాప్‌లలో కూడా మెరుగైన ఏఐ ఫీచర్లు జోడించనున్నారు. యాపిల్ డివైజ్‌ల కోసం ఏఐ ఫీచర్లను అభివృద్ధి చేయడానికి వచ్చే ఏడాదిలో దాదాపు 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.8,300 కోట్లు) యాపిల్‌ ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆ సమయంలో ఈ ఏడాది విడుదలయ్యే ఐఫోన్ 16 సిరీస్‌లో హార్డ్‌వేర్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చంటున్నారు. ఐఓఎస్‌ 18 పైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని