ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌తో నాయిస్‌ జట్టు.. స్మార్ట్‌వాచ్‌తోనే పేమెంట్స్

Smart Watch: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌, మాస్టర్‌కార్డ్‌తో కలసి నాయిస్‌ కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్‌ చేసింది. డిజిటల్‌ లావాదేవీలను మరింత సులభతరం చేయడం కోసం దీన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. 

Published : 19 Mar 2024 20:38 IST

Tap and Pay Smart Watch | ఇంటర్నెట్‌డెస్క్‌: డిజిటల్‌ యుగంలో లావాదేవీలు జరపడం సులభంగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఫోన్‌లోని క్యూఆర్‌ కోడ్‌ సాయంతో స్కాన్‌ చేసి డబ్బులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఈ లావాదేవీలు మరింత స్మార్ట్‌గా మారాయి. ఎంతలా అంటే.. చెల్లింపులు జరిపేందుకు ఇకపై మొబైల్‌తో పని లేదు. కేవలం స్మార్ట్‌వాచ్‌ ఉంటే చాలు. సులువుగా చెల్లింపులు చేసేయొచ్చు. ఈ సదుపాయంతో ప్రముఖ వేరియబుల్‌ బ్రాండ్‌ నాయిస్‌ కొత్త స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌, మాస్టర్‌ కార్డుతో జట్టు కట్టింది.

టీసీఎస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో వేతన పెంపు!

దేశంలో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను విస్తరించాలనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చినట్లు నాయిస్‌ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ వాచ్‌ ధరను రూ.2,999గా నిర్ణయించారు. ఎయిర్‌టెల్‌ థాంక్స్‌ యాప్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు తమ సేవింగ్స్ ఖాతాను ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా స్మార్ట్‌వాచ్‌ను లింక్‌ చేయొచ్చు. పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషీన్‌ వద్ద వాచ్‌ను ట్యాప్ చేసి సులువుగా లావాదేవీలు జరపొచ్చు. రోజుకు రూ.1 నుంచి రూ.25,000 వరకు చెల్లింపులు చేయొచ్చు. ఇందులో బ్లూటూత్ కాలింగ్ సదుపాయం కూడా ఉంది. 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. SpO2, IP68 వాటర్ రెసిస్టెన్స్, స్ట్రెస్ మానిటరింగ్‌తో పాటు వివిధ స్పోర్ట్స్ మోడ్స్‌ ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని