TCS: టీసీఎస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో వేతన పెంపు!

TCS: ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌ ఆన్‌సైట్‌, ఆఫ్‌సైట్‌ ఉద్యోగుల వేతనాలు పెంచనుంది. పనితీరు కనబరిచిన వారికి ఏకంగా 12-15 శాతం పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Published : 19 Mar 2024 14:46 IST

TCS salary hike | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల వేతనాలు (Salary hike) పెంచనుంది. ఆఫ్‌సైట్‌ ఉద్యోగులకు సగటున 7 నుంచి 8 శాతం.. ఆన్‌సైట్‌ ఉద్యోగులకు 2-4 శాతం పెంచే యోచనలో ఉందని ‘బిజినెస్‌ స్టాండర్డ్‌’ తన కథనంలో పేర్కొంది. నైపుణ్యాలను మెరుగుపరుచుకొని పనితీరు కనబరిచిన వారికి ఏకంగా 12-15 శాతం వరకు జీతం పెంచనున్నట్లు పేర్కొంది.

టీసీఎస్‌ ఉద్యోగుల వేతన పెంపు ప్రక్రియ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచే ఈ వేతన పెంపు అమల్లోకి వస్తుందని సమాచారం. అయితే, ఉన్నత స్థాయిలో ఉన్న వారి పదోన్నతులు, ఖర్చులపై ఉన్న ఆందోళనల్ని ఇంకా కంపెనీ పరిశీలిస్తున్నట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. ప్రమోషన్లకు సంబంధించిన ప్రక్రియను కూడా తొలి త్రైమాసికంలోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకించింది. ఇలాంటి ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించడం కంపెనీ నిబంధనలకు విరుద్ధమని టీసీఎస్‌ ప్రతినిధి పేర్కొన్నారు.

2026లో బుల్లెట్‌ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్‌ ఇండియా’ చిప్‌

ప్రతీ ఐటీ కంపెనీ కొత్త ఏడాది మొదటి త్రైమాసికంలోనే జీతాల పెంపును ప్రకటిస్తాయి. నైపుణ్యాలను మెరుగుపర్చుకున్న వారికి గతేడాదిలోనే టీసీఎస్‌ 12-15 శాతం వరకు సగటు ఇంక్రిమెంట్‌ను ఇచ్చింది. అంతేకాదు ప్రమోషన్లను అందించింది. మరోవైపు గతేడాది ఉద్యోగుల సంఖ్యను టీసీఎస్‌ తగ్గించుకుంది. దీంతో 2023 డిసెంబరు నాటికి టీసీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల సంఖ్య 6,03,305గా ఉంది. 2023 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.11,058 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.10,846 కోట్లతో పోలిస్తే 2 శాతం పెరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని