Airtel: 3 నెలల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్‌ అందిస్తున్న డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్లాన్లు ఇవే..

Airtel: ఎయిర్‌టెల్‌ మూడు నెలల కాలవ్యవధితో రెండు డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్లాన్లను అందిస్తోంది. వాటిలో ఉన్న ఇతర ప్రయోజనాలు కూడా యూజర్లను ఆకర్షిస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం..!

Published : 08 May 2023 10:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో రోజురోజుకీ ఓటీటీ (OTT)లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో టెలికాం సంస్థలు అందుకు అనుగుణంగా ప్రీపెయిడ్‌ ప్లాన్ల (Prepaid Plans)ను తీసుకొస్తున్నాయి. అత్యంత ఆదరణ ఉన్న ఓటీటీ (OTT)ల్లో డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) ఒకటి. ఎయిర్‌టెల్‌ ఈ ఓటీటీని అందిస్తూ పలు ప్లాన్లను రూపొందించింది. అందులో మూడు నెలల కాలవ్యవధితో వస్తున్న ప్లాన్లకు మంచి ఆదరణ ఉంది. మరి అవేంటి? వాటిలో ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!

రూ.839 అపరిమిత ప్లాన్‌..

ఎయిర్‌టెల్‌ అందిస్తున్న ఈ రూ.839 అపరిమిత ప్లాన్‌తో యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్‌ కాల్స్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు. 2జీబీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్‌ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. యూజర్లకు 2జీబీ డేటా కూపన్‌ కూడా వస్తుంది. దీన్ని ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకునే సమయంలో క్లెయిం చేసుకోవచ్చు. మరోవైపు ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతంలో అపరిమిత 5జీని కూడా ఎంజాయ్‌ చేయొచ్చు.

ఈ ప్రయోజనాలతో పాటు రూ.839 ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) సబ్‌స్క్రిప్షన్‌ను మూడు నెలల వరకు పొందొచ్చు. అలాగే 84 రోజుల పాటు ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌లోని ఏదో ఒక ఛానెల్‌ను వీక్షించొచ్చు. సోనీలివ్‌, లయన్స్‌గేట్‌ప్లే, ఈరోస్‌నౌ, హోయ్‌చొయ్‌, మనోరమామ్యాక్స్‌, చౌపల్‌, కచ్చాలంకా వంటి ప్రముఖ ఛానెళ్ల జాబితా నుంచి నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ అందించే రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందొచ్చు. మూడు నెలల పాటు అపోలో 24x7 సర్కిల్‌ సభ్యత్వం, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్‌, ఉచిత హలోట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌ కూడా వస్తాయి.

ఎయిర్‌టెల్‌ రూ.499 ప్లాన్‌..

ఈ రూ.499 ప్లాన్‌లోనూ అపరిమిత లోకల్‌, ఎస్‌టీడీ, రోమింగ్‌ కాల్స్‌ వస్తాయి. రోజుకి 3జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. 3జీబీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్‌ వేగం 64 కేబీపీఎస్‌కు పరిమితమవుతుంది. 5జీ నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతంలో 5జీ డేటాను పరిమితి లేకుండా వినియోగించుకోవచ్చు. ఈ ప్రయోజనాల కాలపరిమితి 28 రోజులు.

ఈ ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar)ను మూడు నెలల పాటు పొందొచ్చు. మరోవైపు 28 రోజుల పాటు ఎంపిక చేసుకున్న ఏదో ఒక ఎక్స్‌ట్రీమ్‌ ఛానెల్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది. అపోలో 24x7 సర్కిల్‌ సభ్యత్వం మూడు నెలల పాటు వస్తుంది. ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్‌ అందుతుంది. ఉచిత హలోట్యూన్స్‌ లభిస్తాయి. వింక్‌ మ్యూజిక్‌ను కూడా పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని