Airtel vs Jio: నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్, జియో ప్రీపెయిడ్‌ ప్లాన్లు ఇవే..

Netflix Prepaid Plans: ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్‌ని అందిస్తున్న టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్‌.. నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లు అందిస్తున్నాయి.

Updated : 29 Nov 2023 11:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థలైన భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel), రిలయన్స్‌ జియో (Jio) దేశమంతటా 5జీ నెట్‌వర్క్‌ సేవల్ని వేగంగా విస్తరిస్తున్నాయి. అదే సమయంలో టెలికాం సబ్‌స్క్రైబర్లను పెంచుకుంటూ పోటాపోటీగా సరికొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ఈ రెండు సంస్థలు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చాయి. ఆయా ప్లాన్ల ధరలు, ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..

ఎయిర్‌టెల్‌ రూ.1,499 ప్లాన్‌: ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన రూ.1,499 ప్లాన్‌తో రీఛార్జిపై రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 84 రోజుల కాలపరిమితితో వచ్చే ఈ ప్లాన్‌కు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్, అపరిమిత 5G డేటా యాక్సెస్ లభిస్తుంది. దీంతో పాటు మూడు నెలలపాటు ఉచిత అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్‌ కూడా లభిస్తుంది.

జియో రెండు ప్లాన్లు: నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో జియో రూ.1,099, రూ.1,499 రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. జియో రూ.1,099 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే.. రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌కు నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. రూ.1,499 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 3జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు. నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ఈ రెండు ప్లాన్లతో జియో యాప్స్‌ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని