Airtel: నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్‌ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌..

Airtel: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను తన యూజర్ల కోసం తీసుకొచ్చింది.

Published : 25 Nov 2023 11:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) దేశవ్యాప్తంగా ఉన్న తమ యూజర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్‌ ప్రారంభించింది. అపరిమిత వాయిస్‌ కాల్స్‌తో పాటూ నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఈ ప్లాన్‌ ద్వారా అందిస్తోంది.

ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన రూ.1,499 ప్లాన్‌తో రీఛార్జి చేసుకుంటే 84 రోజుల పాటూ రోజూ 3జీబీ డేటా పొందొచ్చు. అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 84 రోజుల కాలపరిమితితో వచ్చే ఈ ప్లాన్‌కు కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్, అపరిమిత 5G డేటా యాక్సెస్ ఇస్తోంది. అంతేకాకుండా మూడు నెలలపాటు ఉచిత అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, ఉచిత హెలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్‌ కూడా అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని