Bharti Airtel: ₹148కే ఎక్స్‌ట్రీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌

Bharti Airtel: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ తన యూజర్ల కోసం ఎక్స్‌ట్రీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో  సరికొత్త డేటా ప్లాన్‌ తీసుకొచ్చింది.

Updated : 25 Jul 2023 10:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) తన కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌ ప్రవేశపెట్టింది. కేవలం రూ.148 డేటా వోచర్‌తో 15 జీబీ డేటా, ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ (Xstream Play) అందించనుంది. యాక్టివ్‌ ప్లాన్‌లోనే దీన్ని యాడ్‌ చేసుకోవచ్చు. అయితే, దీంట్లో ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లకు కూడా అనుమతి లభిస్తుండటం ప్రత్యేకత.

స్టాక్‌ మార్కెట్లో లావాదేవీల సెటిల్‌మెంట్‌ అప్పటికప్పుడే

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 15జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటా వినియోగానికి రోజు వారీ పరిమితులు ఉండవు. ప్లాన్‌ వ్యాలిడిటీ ముగిసేలోగా మీ అవసరానికి తగినట్లుగా డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్‌నూ అందిస్తోంది. సోనీలీవ్ ప్రీమియం, ఎరోస్‌ నౌ, హోయిచోయ్, లయన్స్‌గేట్ ప్లే తో పాటు మొత్తం 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీం యాప్‌ ద్వారా మాత్రమే ఓటీటీ (OTT)లకు అనుమతి ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ లభిస్తుంది. అయితే.. దీంతో పాటు రూ.149 రీఛార్జ్‌తో కూడా 28 రోజులపాటు ఈ ఓటీటీల సదుపాయాన్ని ఆనందించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని