Airtel Airfiber: ఎయిర్‌టెల్‌ నుంచి ఎయిర్ ఫైబర్‌ డివైజ్‌..?

Airtel Xstream AirFiber 5G Device: జియో తరహాలో ఎయిర్‌టెల్‌ ఎయిర్‌ ఫైబర్‌ను తీసుకురాబోతోంది. దీని ధర ఎంత? ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చేదీ తెలియరాలేదు.

Published : 18 Jul 2023 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel).. ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ ఫైబర్‌ పేరిట (AirFiber 5G) ఓ 5జీ డివైజ్‌ను తీసుకురాబోతోంది. ప్రస్తుతం టెలికాంతో పాటు ఎక్స్‌ట్రీమ్‌ పేరిట ఫైబర్‌ ఇంటర్నెట్‌ సేవలను అందిస్తున్న ఈ సంస్థ.. ఎయిర్‌ ఫైబర్‌నూ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌టెల్‌ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ.. దీనికి సంబంధించిన ఓ యాప్‌ ఒకటి గూగుల్‌ ప్లే స్టోర్‌లో ప్రత్యక్షమైనట్లు పలువురు టెక్‌ నిపుణులు గుర్తించారు.

Airtel: ఎయిర్‌టెల్‌- పోకో కాంబోలో ₹5999కే C51 స్మార్ట్‌ఫోన్‌..!

ఎయిర్‌టెల్‌ ఎయిర్‌ఫైబర్‌ 5జీ డివైజ్‌ కోసం ఉద్దేశించిన ఈ యాప్‌ ప్రకారం.. ఎలాంటి వైర్‌ అవసరం లేకుండా ఎయిర్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలు అందనున్నాయి. తక్కువ ధరకే 5జీ ఇంటర్నెట్‌ వేగాన్ని అందించడం దీని ఉద్దేశం. చిన్నపాటి టవర్‌ ఆకారంలో ఉండే దీన్ని ఇంట్లో ఓ 5జీ సిగ్నల్‌ వచ్చే చోట ఫిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఓ సిమ్‌ కార్డు, పవర్‌ సప్లయ్‌ ఇవ్వాలి. ఇది వైఫై 6ను సపోర్ట్‌ చేస్తుందని తెలుస్తోంది. 100 ఎంబీపీఎస్‌తో కూడిన ఇంటర్నెట్‌ కావాలటే నెలకు రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది. దీని ధర సైతం రూ.6 వేలుకు ఉంటుందని సమాచారం. మరోవైపు జియో సైతం ఎయిర్‌ ఫైబర్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జరిగే రిలయన్స్‌ ఏజీఎంలో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని