Airtel: ఎయిర్‌టెల్‌- పోకో కాంబోలో ₹5999కే C51 స్మార్ట్‌ఫోన్‌..!

Airtel - Poco: ఎయిర్‌టెల్‌- పోకో కాంబోలో సీ51 మొబైల్‌ను రూ5,999కే లభించనుంది. జులై 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Published : 17 Jul 2023 16:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించేందుకు ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ (Airtel).. మొబైల్‌ తయారీ సంస్థ పోకోతో (Poco) జట్టు కట్టింది. ఎయిర్‌టెల్‌ కస్టమర్ల కోసం పోకో సీ51 (Poco C51) ఫోన్‌ను ఎయిర్‌టెల్‌ ఎక్స్‌క్లూజివ్‌గా తీసుకొచ్చారు. జులై 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,999కే విక్రయించనున్నారు. ఈ మొబైల్‌పై అదనపు డేటాను కూడా ఇస్తున్నారు.

పోకో సీ51 ఈ ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి విడుదలైంది. దీన్ని ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రూ.6,999కు విక్రయిస్తున్నారు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌క్లూజివ్‌ పేరిట రూ.5,999కే విక్రయించనున్నారు. ఇందులో 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజీ ఉంటుంది. 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు 8 ఎంపీ కెమెరా, ముందువైపు 5 ఎంపీ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌లో హీలియో జీ36 ప్రాసెసర్‌ను వినియోగించారు. ఫోన్‌తో పాటు 10W ట్రావెల్‌ అడాప్టర్‌, యూఎస్‌బీ కేబుల్‌ ఉంటుంది. పవర్‌ బ్లాక్‌, రాయల్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

SBIలో PPF ఖాతా.. ఆన్‌లైన్‌లో సులువుగా ఇలా తెరవండి..

ఇప్పటికే ఎయిర్‌టెల్‌ కస్టమర్లుగా ఉన్నవారు, కొత్తగా ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌లోకి పోర్ట్‌ అవ్వదలచుకున్నవారు ఈ మొబైల్‌ను కొనుగోలు చేయొచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌ 18 నెలల వరకు ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌కు లాక్‌ అయ్యి ఉంటుంది. నెలకు రూ.199 చొప్పున ఏ ప్లాన్‌ అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌తోనైనా రీఛార్జి చేసుకోవచ్చు. 18 నెలల తర్వాత ఇతర నెట్‌వర్క్‌ సిమ్‌ను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు 50జీబీ డేటాను ఉచితంగా ఇస్తున్నారు. 10 జీబీ చొప్పున మొత్తం 5 కూపన్లు ఐదు నెలల పాటు లభిస్తాయి. సిమ్‌ 2ను యథావిధిగా వేరే నెట్‌వర్క్‌ సిమ్‌ కార్డును వినియోగించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని