Amazon prime: షాపింగ్‌ స్పెషల్‌.. ₹399కే అమెజాన్‌ ప్రైమ్‌!

Amazon prime only for shopping: అమెజాన్‌ కొత్త ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను తీసుకొచ్చింది. షాపింగ్ కోసం మాత్రమే దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

Published : 06 Oct 2023 16:37 IST

Amazon Prime | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’కు (amazon great indian festival 2023) సిద్ధమైంది. అక్టోబర్‌ 8 నుంచి ఈ సేల్‌ మొదలు కానుంది. ప్రైమ్‌ మెంబర్లకు ఒక రోజు ముందుగానే ఈ సేల్‌ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో షాపింగ్‌ కోసం మాత్రమే ఉద్దేశించిన కొత్త ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను అమెజాన్‌ లాంచ్‌ చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ అందించే సదుపాయాల మాదిరిగా ఫ్లిప్‌కార్ట్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకురాగా.. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ షాపింగ్‌ ఎడిషన్‌ను లాంచ్‌ చేయడం గమనార్హం.

షాపింగ్‌, ఓటీటీ, మ్యూజిక్‌ ప్రయోజనాలతో కూడిన అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ (Amazon prime) ధర ఏడాదికి రూ.1499గా ఉంది. ప్రస్తుతం పండగ ఆఫర్ల నేపథ్యంలో కొందరికి రూ.999కే ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ లభిస్తోంది. ఒకవేళ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకోవాలనుకునేవారు మీకూ ఈ ఆఫర్‌ వచ్చిందేమో ఓ సారి చెక్‌ చేయండి. తాజాగా ప్రైమ్‌ షాపింగ్‌ ఎడిషన్‌ను సైతం అమెజాన్‌ ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం పరిచయం చేసింది. దీని ధరను ఏడాదికి రూ.399గా నిర్ణయించింది. ఫ్రీ వన్‌డే డెలివరీ, ఎర్లీ యాక్సెస్‌, అమెజాన్‌ ఐసీఐసీఐ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ వంటివి లభిస్తాయి. ప్రైమ్‌ వీడియో, ప్రైమ్‌ మ్యూజిక్‌ వంటివి ఈ ప్లాన్‌లో ఉండవు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో కొందరికి మాత్రమే ఈ ప్లాన్‌ కనిపిస్తోంది. ఆన్‌లైన్‌ ఎక్కువగా షాపింగ్‌ చేసే వారికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.

క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోసం ఎయిర్‌టెల్‌, జియో ప్రత్యేక ప్రీపెయిడ్‌ ప్లాన్లు

అంతకుముందు ఫ్లిప్‌కార్ట్‌ సైతం వీఐపీ పేరిట కొత్త మెంబర్‌షిప్‌ను తీసుకొచ్చింది. వీఐపీ కస్టమర్లకు సేమ్‌డే/ వన్‌డే డెలివరీ సదుపాయం, 48 గంటల్లో ఫాస్ట్‌ట్రాక్‌ రిటర్న్‌, డెడికేటెడ్‌ కస్టమర్‌ సపోర్ట్‌ వంటి ప్రయోజనాలను ఈ ప్లాన్‌ ద్వారా అందిస్తున్నారు. అలాగే క్లియర్‌ట్రిప్‌ ద్వారా తక్కువ రుసుము చెల్లించి విమాన సర్వీసులను రీషెడ్యూల్‌ చేసుకునే సదుపాయాన్ని వీఐపీ కస్టమర్లకు కల్పిస్తున్నారు. అయితే, కేవలం దిల్లీ- ఎన్‌సీఆర్‌, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, కొన్ని ఎంపిక చేసిన పిన్‌కోడ్‌లకు మాత్రమే ఈ మెంబర్‌షిప్‌ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైమ్‌ షాపింగ్‌ను అమెజాన్‌ తీసుకురావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని