Prepaid Plans: క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోసం ఎయిర్‌టెల్‌, జియో ప్రత్యేక ప్రీపెయిడ్‌ ప్లాన్లు

Prepaid Plans: భారత్‌లో వన్డే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023 ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోసం ఎయిర్‌టెల్‌, జియో ప్రత్యేక ప్లాన్లను తీసుకొచ్చాయి. వాటి వివరాలు చూద్దాం..

Updated : 06 Oct 2023 15:21 IST

దిల్లీ: క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ (ODI World Cup 2023) ప్రారంభమైన నేపథ్యంలో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రముఖ టెలికాం సంస్థలు ప్రత్యేక ప్రీపెయిడ్‌ ప్లాన్ల (Prepaid Plans)ను ప్రకటించాయి. రిలయన్స్ జియో (Reliance Jio) క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోసం డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ఏడు ప్లాన్లను ప్రవేశపెట్టింది. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel prepaid plans) రెండు ప్లాన్లను తీసుకొచ్చింది.

ఎయిర్‌టెల్‌ క్రికెట్‌ ప్లాన్లు (Airtel Cricket Plans)..

  • అపరిమిత డేటా ప్యాక్‌: రూ.99తో రెండురోజుల పాటు అపరిమిత డేటాను ఎంజాయ్‌ చేయొచ్చు. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ నుంచే దీన్ని రీఛార్జ్‌ చేసుకోవచ్చు.
  • 6GB డేటా ప్యాక్‌: రూ.49లతో ఒకరోజు వ్యాలిడిటీతో 6GB డేటా అందిస్తోంది ఎయిర్‌టెల్‌. దీంతో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను అంతరాయం లేకుండా వీక్షించేందుకు అవకాశం లభిస్తుంది.

OTT సబ్‌స్క్రిప్షన్‌+ అన్‌లిమిటెడ్‌ డేటా.. జియోలో మరో 3 కొత్త ప్లాన్‌లు

జియో క్రికెట్‌ ప్లాన్లు (Jio Cricket Plans)..

  • రూ.328 ప్లాన్‌: అపరిమిత కాలింగ్‌; రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు, 1.5జీబీ డేటా; 28 రోజుల కాలపరిమితి; 90 రోజులు వ్యాలిడిటీతో జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌.
  • రూ.331 ప్లాన్‌: అపరిమిత కాలింగ్‌; రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు; 40జీబీ డేటా; 30 రోజుల కాలపరిమితి; 90 రోజులు వ్యాలిడిటీతో జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌.
  • రూ.388 ప్లాన్‌: అపరిమిత కాలింగ్‌; రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు 2జీబీ డేటా; 28 రోజుల కాలపరిమితి; 90 రోజులు వ్యాలిడిటీతో జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌.
  • రూ.598 ప్లాన్‌: అపరిమిత కాలింగ్‌; రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు 2జీబీ డేటా; 28 రోజుల కాలపరిమితి; ఏడాది వ్యాలిడిటీతో జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌.
  • రూ.758 ప్లాన్‌: అపరిమిత కాలింగ్‌; రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు 1.5జీబీ డేటా; 84 రోజుల కాలపరిమితి; 90 రోజులు వ్యాలిడిటీతో జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌.
  • రూ.808 ప్లాన్‌: అపరిమిత కాలింగ్‌; రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు 2జీబీ డేటా; 84 రోజుల కాలపరిమితి; 90 రోజులు వ్యాలిడిటీతో జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌.
  • రూ.3,178 ప్లాన్‌: అపరిమిత కాలింగ్‌; రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు 2జీబీ డేటా; 365 రోజుల కాలపరిమితి; ఏడాది వ్యాలిడిటీతో జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని