ఇక కంటితోనే స్క్రీన్‌ను ఆపరేట్‌ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు

Eenadu icon
By Business News Team Published : 18 May 2024 00:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Apple | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ తన ఐఫోన్‌, ఐప్యాడ్‌లలో కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దివ్యాంగులు కూడా సులభంగా యాపిల్‌ డివైజ్‌లను యాక్సెస్‌ చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయని పేర్కొంది. ఈ ఏడాది చివరికి అందుబాటులోకి రానున్న ఫీచర్లలో ఐట్రాకింగ్‌, మ్యూజిక్‌ హాప్టిక్స్‌, వోకల్‌ షార్ట్‌కట్‌లు ఉండనున్నాయి. 

ఐ ట్రాకింగ్‌ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాయంతో పనిచేస్తుంది. వినియోగదారులు కంటి కదలికలతో ఐప్యాడ్‌లు, ఐఫోన్‌లను నియంత్రించొచ్చు. ప్రత్యేక అవసరాలు కలిగినవారు ఫోన్‌ను సులభంగా నావిగేట్ చేయడానికి వీలుగా ఆన్-డివైస్ మెషీన్ లెర్నింగ్ (ML) ఫీచర్లు తీసుకురానున్నారు. యాపిల్‌ డివైజుల్లో ముందువైపున్న కెమెరా కేవలం కొన్ని సెకెన్లలోనే మీ కళ్లను ట్రాక్ చేస్తుంది. స్క్రీన్‌ను టచ్‌ చేయకుండానే కంటితో చూస్తూ నావిగేట్‌ చేయొచ్చు. అయితే దీని వల్ల గోప్యతకు ఎటువంటి భంగం వాటిల్లదని కంపెనీ చెబుతోంది. అన్ని యాప్‌లను యాక్సెస్ చేసేందుకు ఈ ఫీచర్లు సాయపడతాయి. దీనికోసం అదనపు హార్డ్‌వేర్‌, ఎటువంటి యాక్సెసరీలు అవసరం లేదు.

ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి

మ్యూజిక్‌ హాప్టిక్స్‌ అనేది వినికిడిలోపం ఉన్నవారు కూడా ఐఫోన్‌లో సంగీతాన్ని ఆస్వాదించేందుకు తీసుకురానున్న మరో కొత్త ఫీచర్‌. పాటకు తగ్గట్టుగా వైబ్రేషన్‌లు ఇతర ఎఫెక్ట్‌లు వస్తాయి. దీంతో రిథమ్‌కి తగట్టుగా అందులో వచ్చే వైబ్రేషన్స్‌తోనే చెవిటి వాళ్లకు సంగీతం విన్న ఫీల్‌ వస్తుంది. సరిగ్గా ఉచ్చరించలేని వారి కోసం యాపిల్‌ వోకల్‌ షార్ట్‌కట్‌ సదుపాయాన్ని పరిచయం చేయనుంది. స్పష్టంగా మాట్లాడలేనివారు చెప్పే పదాలను ఐఫోన్‌లోని సిరి సులభంగా అర్థం చేసుకోగలదట. వీటితో పాటు వెహికల్‌ మోషన్‌ క్యూస్‌, కార్‌ ప్లే, సౌండ్‌ రికగ్నైజేషన్‌, కలర్‌ ఫిల్టర్స్‌.. వంటివి కూడా తీసుకురానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని