Asus Zenbook Duo: ఆసుస్‌ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!

Asus: ఆసుస్‌ సరికొత్త ల్యాప్‌టాప్‌ను మంగళవారం భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..?

Published : 17 Apr 2024 00:05 IST

Asus laptop | ఇంటర్నెట్‌డెస్క్‌: తైవాన్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ ఆసుస్‌ (Asus) సరికొత్త ల్యాప్‌ట్యాప్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఆసుస్‌ జెన్‌బుక్‌ డ్యూ (Asus Zenbook Duo 2024) పేరుతో దీన్ని తీసుకొచ్చింది. సాధారణ ల్యాపీలకు ఇది కాస్త భిన్నం. ఇందులో రెండు డిస్‌ప్లేలు ఉంటాయి. అంతేకాదు కీబోర్డును కూడా డీ-అటాచ్‌ చేయొచ్చు. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ ల్యాపీ విశేషాలేంటో చూసేద్దామా?

సాధారణంగా ఉండే ల్యాప్‌ట్యాప్‌ల కంటే కొంచెం వినూత్నంగా ఆసుస్‌ దీన్ని తీసుకొచ్చింది. అవసరమైనప్పుడు కీబోర్డ్‌ని తీసేసి కింద ఉన్న స్క్రీన్‌ని మరో డిస్‌ప్లేగా వాడుకొనేందుకు వీలుగా దీన్ని రూపొందించింది. అంటే ఈ ల్యాప్‌ట్యాప్‌ను రెండు స్క్రీన్లుగా వాడుకోవచ్చన్నమాట. అంతేకాదు కీబోర్డ్‌ని ల్యాపీ నుంచి వేరు చేయొచ్చు. కావాలంటే తిరిగి అతికించేయొచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 5 ప్రాసెసర్‌ ధర రూ.1,59,990, ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 7 వేరియంట్‌ ధర రూ.1,99,990గా కంపెనీ నిర్ణయించింది. ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 9 ప్రాసెసర్‌తో రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్లతో వస్తున్న ల్యాపీల ధర రూ.2,19,990, రూ.2,39,990గా పేర్కొంది.

జొమాటోలో పెద్ద ఆర్డర్లకు ప్రత్యేక ఫ్లీట్‌

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల రెండు లూమినా ఓఎల్‌ఈడీ టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 32జీబీ ర్యామ్‌తో వస్తుంది. 2 టీబీ వరకు స్టోరేజీ సదుపాయం ఉంది. ఇందులో వైఫై 6E, బ్లూటూత్‌ 5.3, రెండు థండర్‌ బోల్ట్‌ 4 పోర్టులు, యూఎస్‌బీ 3.2 జెన్‌ 1 టైప్‌-ఎ పోర్ట్‌, హెచ్‌డీఎంఐ 2.1 పోర్ట్‌, 3.5mm ఆడియో జాక్‌ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 75Whr లిథియం పాలిమర్‌ బ్యాటరీతో వస్తున్న ల్యాపీ 65W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. యూఎస్‌బీ టైప్‌- సి పోర్ట్‌ సదుపాయం ఉన్న ల్యాప్‌ట్యాప్‌ 49 నిమిషాల్లో 60 శాతం ఛార్జి అవుతుందని పేర్కొంది. వీటి విక్రయాలు ఎప్పటినుంచి ప్రారంభం కానుందనే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని