iPhone: ఐఫోన్‌ను ఇలా చేయొద్దు.. యూజర్లకు యాపిల్‌ హెచ్చరిక

iPhone: యాపిల్‌ సంస్థ తన యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. ఫోన్‌లోని తడిపోవడానికి బియ్యం సంచిలో పెట్టడం వంటి పనులు చేయొద్దని సూచించింది.

Updated : 20 Feb 2024 17:30 IST

iPhone | ఇంటర్నెట్‌డెస్క్‌: పొరపాటున సెల్‌ఫోన్‌ నీటిలో పడితే కొంతమంది వెంటనే దాన్ని తుడిచేసి ఇంట్లో ఉండే బియ్యం సంచిలో ఉంచుతారు. ఒక రోజంతా అలాగే ఉంచి మరుసటి రోజు తీసి ఛార్జింగ్‌ పెడుతుంటారు. ఫోన్‌లో చేరిన నీటిని తొలగించడానికి ఇలాంటి సొంత ప్రయత్నాలు, చిట్కాలను పాటిస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఫోన్‌ మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని యాపిల్‌ కంపెనీ హెచ్చరిస్తోంది. 

‘ఐఫోన్‌ను బియ్యం సంచిలో పెట్టొద్దు. అలా చేయడం వల్ల బియ్యంలోని సూక్ష్మ పరిమాణంలో ఉండే రేణువులు ఫోన్‌ను దెబ్బతీస్తాయి’ అని యాపిల్‌ తెలిపింది. నీరు చేరినప్పుడు ఏం చేయాలో కూడా సూచించింది.  ‘నీటిని తీసివేయడానికి కనెక్టర్‌ కిందివైపు ఉండేలా డివైజ్‌ను ఉంచి నెమ్మదిగా చేతితో కొట్టండి. తర్వాత ఫోన్‌ను పొడిగా ఉండే ప్రదేశంలో ఉంచండి. 30 నిమిషాల తర్వాత మాత్రమే యూఎస్‌బీ- సీ లేదా, లైటెనింగ్‌ కనెక్టర్‌తో ఛార్జ్‌ చేయండి.  నీరు బయటకు పోవడానికి 24 గంటల సమయం పట్టొచ్చు. లిక్విడ్‌ డిటెక్షన్‌ అలర్ట్‌ ద్వారా ఫోన్‌ పరిస్థితి తెలుసుకోవచ్చు’ అని యాపిల్‌ తెలిపింది.

సీక్రెట్‌ కోడ్‌తో వాట్సప్‌ వెబ్‌లోనూ ‘లాక్‌ చాట్‌’ ఫీచర్‌!

‘ఒక్కోసారి ఫోన్‌ తడిగా ఉన్నప్పుడు అత్యవసరంగా ఛార్జ్‌ చేయాల్సి వస్తే ‘లిక్విడ్‌ డిటెక్షన్‌’ను ఓవర్‌రైడ్‌ చేసే వెసులుబాటు ఉంటుంది’ అని యాపిల్‌ పేర్కొంది. ఐఫోన్‌ కొత్తగా కొనుగోలు చేసిన యూజర్లు ఈ సమస్య గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.  20 అడుగుల నీటిలో 30 నిమిషాల పాటు ఉన్నా పనిచేసే సామర్థ్యం ఐఫోన్లకు ఉంటుందని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని