WhatssApp: సీక్రెట్‌ కోడ్‌తో వాట్సప్‌ వెబ్‌లోనూ ‘లాక్‌ చాట్‌’ ఫీచర్‌!

WhatssApp: ఇటీవలే తీసుకొచ్చిన లాక్‌ చాట్‌ ఫీచర్‌ను వెబ్‌కూ విస్తరించేందుకు వాట్సప్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

Published : 20 Feb 2024 14:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెబ్‌ యూజర్ల కోసం మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సప్‌ (WhatssApp) సిద్ధమవుతోంది. యాప్‌లో లాక్‌ చేసిన చాట్‌లను వెబ్‌లో యాక్సెస్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా సీక్రెట్‌ కోడ్‌ అవసరమయ్యేలా దీన్ని తీర్చిదిద్దుతోంది. తద్వారా ఇటీవలే తీసుకొచ్చిన ‘లాక్‌ చాట్‌’ ఫీచర్‌ను వెబ్‌ వెర్షన్‌కూ విస్తరించే యోచనలో ఉంది.

‘సీక్రెట్‌ కోడ్‌ ఫీచర్‌’గా పేర్కొంటున్న ఈ కొత్త ఆప్షన్‌ ఇంకా డెవలప్‌మెంట్‌ దశలో ఉంది. లాక్‌ చేసిన చాట్‌లను వాట్సప్‌ వెబ్‌ (WhatsApp Web)లో ఓపెన్‌ చేయాలంటే ముందే సెట్‌ చేసుకున్న సీక్రెట్‌ కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తద్వారా వ్యక్తిగత లేదా రహస్య సమాచారం ఇతరులకు లీక్‌ కాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఆఫీసులు, సైబర్‌కేఫ్‌ల వంటి ప్రదేశాల్లో ఈ కొత్త ఫీచర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లాగౌట్‌ చేయకున్నా.. ఇతరులెవరూ సీక్రెట్‌ చాట్‌లను కోడ్‌ ఎంటర్‌ చేయకుండా చూసేందుకు వీలుండదు. రాబోయే అప్‌డేట్‌లో ఈ కొత్త ఫీచర్‌ను అందరికీ అందించే అవకాశం ఉందని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వాట్సప్‌ చెయ్‌.. డీప్‌ఫేక్‌ను పట్టెయ్‌!

మరోవైపు లాక్‌ చాట్‌ ఫీచర్‌ను వాట్సప్‌ (WhatssApp) మరింత సులభతరం చేసింది. ప్రత్యేకంగా సెటింగ్స్‌లోకి వెళ్లి ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మార్పులు చేసింది. లాక్‌ చేయాలనుకున్న చాట్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేసి ‘లాక్‌ చాట్‌’ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు