Bharti Airtel: రూ.49తో ఎయిర్‌టెల్‌లో కొత్త డేటా వోచర్‌

Bharti Airtel: ఎయిర్‌టెల్‌ కొత్త డేటా వోచర్‌ను తీసుకొచ్చింది. దీనిపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంట్లో ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

Published : 05 Jun 2023 12:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) ఎలాంటి ప్రకటన లేకుండానే కొత్త 4జీ డేటా వోచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది బేస్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ కాదు. కేవలం డేటా బూస్టర్‌ (Data Booster) మాత్రమే. దీని కాలపరిమితి ఒకరోజు. 6జీబీ డేటా లభిస్తుంది. ఇతర ఎలాంటి ప్రయోజనాలు లేవు. ఒకరోజులో పెద్ద మొత్తం డేటా అవసరమైన సమయంలో ఈ డేటా వోచర్‌ ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని పొందాలంటే కచ్చితంగా నెంబర్‌పై బేస్‌ ప్లాన్‌ యాక్టివేట్‌ అయి ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని