boAt Data Breach: బోట్‌ యూజర్లకు షాక్‌.. రిస్క్‌లో 75 లక్షల మంది డేటా

బోట్‌ వేరియబుల్‌ బ్రాండ్‌కు సంబంధించిన యూజర్ల డేటా ప్రమాదంలో పడింది. 75 లక్షల మంది డేటా లీకైనట్లు ఫోర్బ్స్‌ ఇండియా పేర్కొంది.

Published : 08 Apr 2024 17:44 IST

boAt Data Breach | ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ ఆడియో ఉత్పత్తులు, స్మార్ట్‌ వాచ్‌ల తయారీ సంస్థ బోట్‌ (boAt) యూజర్ల డేటా ప్రమాదంలో పడింది. సుమారు 75 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకైంది. లీకైన డేటాలో వ్యక్తుల పేర్లు, చిరునామాలు, ఫోన్‌ నంబర్లు, కస్టమర్‌ ఐడీలు వంటివి ఉన్నాయి. తస్కరించిన  డేటాలో సుమారు 2జీబీ డేటాను హ్యాకర్‌ ఓ ఫోరమ్‌లో అందుబాటులో ఉంచినట్లు ఫోర్బ్స్‌ ఇండియా పేర్కొంది.

బోట్‌కు చెందిన డేటాను షాపిఫైగై (ShopifyGUY) అనే హ్యాకర్‌ ఏప్రిల్‌ 5న ఈ డేటాను పోస్ట్‌ చేసినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. ఈ డేటా తస్కరణ వల్ల వ్యక్తిగత డేటా బయటకు పొక్కడమే కాకుండా.. ఆర్థిక మోసాలు, సైబర్‌ నేరగాళ్ల నుంచి ఫిషింగ్‌ అటాక్స్‌కు ఆస్కారం ఉంటుందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ డేటా ద్వారా సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు ఖాతా లావాదేవీలు నిర్వహించడంతో పాటు క్రెడిట్‌ కార్డులను మోసపూరిత లావాదేవీలకు వినియోగించే ప్రమాదమూ ఉందని పేర్కొంటున్నారు.

45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ శాంసంగ్‌ ఎం55.. ₹12 వేలకే ఎం 15

ఈ తరహా డేటా లీకేజీ వల్ల కంపెనీలు వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోవడంతో పాటు న్యాయపరమైన చిక్కులూ ఎదుర్కోవాల్సి ఉంటుందని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు. డేటా లీకేజీ ఘటనపై బోట్‌ అధికారికంగా స్పందించలేదు. అమన్‌ గుప్తా, సమీర్‌ మెహతా కలిసి 2016లో బోట్‌ను సంస్థను ప్రారంభించారు. 2023 మూడో త్రైమాసికంలో రెండో పాపులర్‌ వేరియబుల్‌ బ్రాండ్‌గా అవతరించిందని ఐడీసీ తన నివేదికలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని