Samsung Galaxy M55: 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ శాంసంగ్‌ ఎం55.. ₹12 వేలకే ఎం 15

Samsung Galaxy M55: శాంసంగ్‌ కొత్త ఫోన్లను లాంచ్‌ చేసింది. ఎం సిరీస్‌లో 55 5జీ, 15 5జీ ఫోన్లను తీసుకొచ్చింది. అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభమయ్యాయి.

Published : 08 Apr 2024 17:11 IST

Samsung Galaxy M55 | ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణ కొరియాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ (Samsung) ఎం సిరీస్‌లో కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. ఎం 54 5జీకి కొనసాగింపుగా గెలాక్సీ ఎం 55 5జీని (Samsung Galaxy M55) లాంచ్‌ చేసింది. దీంతోపాటు తక్కువ ధరలో 5జీ ఫోన్‌ కోరుకునే వారి కోసం ఎం 15 5జీని(M15) తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌ ఫీచర్లేంటి? ధరెంత? వంటి వివరాలు చూద్దాం..

శాంసంగ్‌ ఎం 55

  • శాంసంగ్‌ ఎం 55 మూడు వేరియంట్స్‌లో లభిస్తుంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.26,999; 8జీబీ+256జీబీ ధర రూ.29,999; 12జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.32,999గా కంపెనీ నిర్ణయించింది. అమెజాన్‌, శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా ఈ ఫోన్‌ను ఏప్రిల్‌ 8 నుంచి కొనుగోలు చేయొచ్చు. డెనిమ్‌ బ్లాక్‌, లైట్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్లాన్‌

  • ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌ ప్లస్‌ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటు, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌ అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత వన్‌యూఐ 6.1తో వస్తోంది. నాలుగేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ చెబుతోంది.
  • 50 మెగా పిక్సెల్‌ ప్రధాన కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో (OIS) వస్తోంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ముందు వైపున కూడా 50 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వస్తోంది. ఎన్‌ఎఫ్‌సీ సదుపాయం ఉంది. 

తక్కువ ధరలో ఎం 15 5జీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎం 15 5జీ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోలోడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్‌సిటీ 6100+ ప్రాసెసర్‌ ఉంది. 90Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. ఇందులో వెనకవైపు 50 ఎంపీ కెమెరా, 5 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌ ఉన్నాయి. ముందువైపు 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఔట్‌ ఆఫ్ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 14తో వస్తోంది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది. దీని ధర రూ.12,299 నుంచి ప్రారంభం అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని