Boat earbuds: 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో బోట్‌ గేమింగ్‌ ఇయర్‌బడ్స్‌

Boat earbuds: సింగిల్‌ ఛార్జ్‌తో 50 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌తో బోట్‌ ఇయర్‌బడ్స్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర రూ.2,299గా కంపెనీ నిర్ణయించింది.

Published : 01 Dec 2023 01:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ వేరెబుల్స్‌ ఉత్పత్తుల సంస్థ బోట్‌ (Boat) వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ ఇమ్మోర్టల్ కటనా బ్లేడ్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఐకానిక్‌ కటనా బ్లేడ్‌ నుంచి ప్రేరణతో దీన్ని రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. మెటల్ టాప్‌ ఎంతో ఆకర్షణీయమైన డిజైన్‌లో ఈ ఇయర్‌ బడ్స్‌ తీసుకొచ్చింది. సింగిల్‌ ఛార్జ్‌తో 50 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌తో వస్తుండడం ఈ ఇయర్‌ బడ్స్‌ ప్రత్యేకత.

ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి

బోట్ గేమింగ్‌ ఇయర్‌బడ్స్‌ ధరను రూ.2,299గా కంపెనీ నిర్ణయించింది. గన్‌మెటల్‌ బ్లాక్‌, గ్రే రెండు రంగుల్లో లభిస్తుంది. బోట్‌ వెబ్‌సైట్‌, అమెజాన్‌ వంటి ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే అమ్మకాలు మొదలయ్యాయని కంపెనీ వెల్లడించింది. మెటల్‌ గ్లైడర్‌లో ఇన్‌బిల్ట్‌ స్పీకర్‌తో ఈ ఇమ్మోర్టల్ కటనా బ్లేడ్ గేమింగ్ ఇయర్‌బడ్స్‌ని తీసుకొచ్చారు. దీంతో కేస్‌ ఓపెన్‌ చేసిన ప్రతి సారీ సౌండ్ వస్తుంది. ఈ ఇయర్‌బడ్స్‌ ఒక సారి ఫుల్‌ ఛార్జి చేస్తే 50 గంటల వరకు ప్లే బ్యాక్‌ టైమ్‌ ఇస్తాయి. ఏఎస్‌ఏపీ ఛార్జర్‌తో కేవలం 10 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే చాలు 3 గంటల పాటు ఇయర్‌బడ్స్‌ని వినియోగించుకోవచ్చు. బ్లూటూత్‌ 5.3 కనెక్టివిటీతో పనిచేస్తాయి. IPX4 రేటింగ్‌ కలిగిన వాటర్‌ రెసిస్టెన్స్‌ సదుపాయం ఉంది. గేమ్‌ ఆడటానికి వీలుగా ప్రత్యేకమైన గేమింగ్‌ మోడ్‌ను ఇచ్చారు. ఇందులో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ సదుపాయమూ ఉంది. దీని కోసం ఇయర్‌బడ్స్‌లోని డ్యుయల్‌ మైక్‌లు ENx టెక్‌తో అనుసంధానం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని